చాలా నియోజకవర్గాల్లో పోటీ తీవ్ర ఉత్కంఠగా సాగుతోంది. సాయంత్రానికి ప్రచార పర్వం పూర్తయి ప్రలోభాలపర్వానికి తెరలేస్తుంది. ఇటువంటి సమయంలో ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనే అంచనాలకు తోడు మంత్రుల్లో గిలిచేవారు ఎవరు అనే విషయంపైన కూడా జోరుగా చర్చలు ఊపందుకుంటున్నది. ఇప్పటికైతే క్షేత్రస్ధాయిలోని పరిస్ధితులను చూస్తుంటే ఒక్క కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబునాయుడు గెలుపు మాత్రమే ఖాయమైంది. మరి మిగిలిన మంత్రుల మాటేమిటి ?

 

మంత్రివర్గంలోని ఇతరుల విషయానికి వస్తే శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయడుపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత కనబడుతోంది. ఎవరిని పడితే వారిని తిట్టటం, చెయ్యి చేసుకోవటం, బెదిరించటం లాంటి ఆరోపణలన్నాయి మంత్రిపై.  రెండో మంత్రి కిమిడి కళా వెంకట్రావుపై అసమర్ధుడనే ముద్రపడింది. చంద్రబాబుకు సన్నిహితుడనే ప్రచారం ఉన్నా జిల్లాకు వచ్చిన ఉపయోగం ఏమీ లేదనే చెప్పాలి. అలాగే విజయనగరం జిల్లాలోని ఫిరాయింపు మంత్రి సుజయ కృష్ణ రంగారావుపైన కూడా బాగా వ్యతిరేకత కనబడుతోంది. కాకపోతే ఈ మంత్రికి పోల్ మ్యానేజ్ మెంటు బాగా వచ్చని ప్రచారం. అందుకనే గెలుపోటములపై ఇప్పుడే ఎవరూ చెప్పలేకున్నారు.

 

ఇక విశాఖపట్నం జిల్లాలోని మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇద్దరిపైనా బాగా వ్యతిరేకత కనబడుతోంది. ఇద్దరు కూడా ఒకరి ఓటమి కోసం మరొకరు తీవ్రంగా కష్టపడుతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ముఖ్యంగా గంటాపై విపరీతమైన అవినీతి ఆరోపణలున్నాయి. అలాగే ఉభయగోదావరి జిల్లాల్లో కీలకమైన యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు ఓటమి ఖాయమని టిడిపి నేతలే చెబుతున్నారు. హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పను జనాలు అసలు ప్రచారానికే తమ గ్రామాల్లోకి రానీయటం లేదంటే పరిస్ధితిని అర్ధం చేసుకోవచ్చు.

 

తూర్పులో మంత్రి పితాని సత్యనారాయణ గెలుపు కష్టమే అంటున్నారు. వ్యక్తిగతంగా ఉన్న వ్యతరేకత కన్నా ప్రభుత్వంపై వ్యతిరేకతే బాగా ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. కెఎస్ జవహర్ పై అవినీతితో పాటు అసమ్మతి కూడా ఎక్కువగా కనిపిస్తోంది. గుంటూరు జిల్లాలో ప్రత్తిపాటి పుల్లారావుపైన వ్యక్తిగతంగా కూడా బాగా వ్యతిరేకతుంది. అలాగే కోడెలతో పాటు కుటుంబంపైన ఉన్న అవినీతి ఆరోపణల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. నక్కా ఆనందబాబుపైన వ్యక్తిగత వ్యతిరేకత తక్కువగానే ఉంది.

 

కృష్ణాజిల్లాలో మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావుపై ఉన్న ఆరోపణల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మరో మంత్రి కొల్లు రవీంద్రపై అవినీతి ఆరోపణలకు తోడు అసమర్ధుడని కూడా పేరుంది. రాయలసీమ జిల్లాల్లోని మంత్రులు భూమా అఖిలప్రియ, కెఇ కృష్ణమూర్తి, ఆదినారాయణరెడ్డి, కాలువ శ్రీనివాసులు, పరిటాల సునీతలపై అవినీతి ఆరోపణలకు లెక్కేలేదు. వీళ్ళల్లో కృష్ణమూర్తి, సునీతల వారసులు పోటీలో ఉన్నారు. మందలగిరిలో పోటీ చేస్తున్న లోకేష్ గెలుపు పై బాగా సస్పెన్స్ మారింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దాదాపు 20 మంది మంత్రులు ఓటమి అంచున ఉన్నారట. మరి ఏమవుతుందో ఏమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: