ఏపీలో ఎవరు గెలుస్తారు..ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో ఇదే హాట్ డిస్కషన్. అందుకే జనం ఏ సర్వే వచ్చినా ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఇప్పటివరకూ వచ్చిన సర్వేల్లో నూటికి 95 శాతం వైసీపీకే అనుకూలంగా వచ్చాయి. ఒకటి రెండు టీడీపీ గెలుస్తుందని చెప్పాయి.


అయితే దాదాపు అన్నిసర్వేలు కూడా జనసేన పార్టీకి పది లోపే సీట్లు వస్తాయని తేల్చి చెప్పాయి. మరికొన్ని సర్వేల్లో ఒకటి, రెండు, మూడు సీట్లు వస్తాయని కూడా తేలింది. అయితే ఈ సర్వేలను జనసేన కొట్టి పారేస్తోంది. అస్మదీయ సంస్థలతో సర్వేలు చేయించుకుని ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకుంటున్నారని ఆ పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు. 

ఇప్పుడు ఆ పార్టీ ట్విట్టర్ ఎకౌంట్‌లో ఎన్డీటీవీ టీమ్ శాంపిల్ సర్వే అంటూ ఓ వీడియో పోస్టు చేశారు. విద్యార్థులు అధికంగా ప్రయాణిస్తున్న ఒక బస్సులో ఎన్డీటీవీ టీమ్ ప్రయాణించింది. ఆ బస్సులో ఉన్న వారిని ఎవరికి ఓటేస్తారో చెప్పాలని చేతులు పైకి లేపమని అడిగింది. 

బస్సులో ప్రయాణించేవారిలో వైసీపీ 7, టీడీపీకి 5, జనసేనకు 16 ఓట్లు వచ్చాయి. దీన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో జనసేన బాగా ప్రచారం చేసుకుంటోంది. ఏపీలో రాజకీయ పరిస్థితికి ఇదే నిలువెత్తు నిదర్శనం అంటూ ఊదరగొడుతోంది. పాపం.. వాళ్లూ ఏదో ఒకటి చేయాలిగా మరి అంటూ నెటిజన్లు జాలి పడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: