చంద్రబాబు ఓటమి ఖాయం.. ఇది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాట. ఇందుకు తాజాగా వచ్చిన ఎన్నో సర్వేలు ఉదాహరణలు.. చివరకు టీడీపీ అనుకూల పత్రికలు సైతం జగన్‌ ఫుల్ టైట్ ఇస్తున్నాడని సర్వేల్లో చెబుతున్నాయి. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది.. చంద్రబాబు ఎందుకు ఓడిపోతున్నాడు.. 


ఈ అంశాలపై ప్రోఫెసర్ కె.నాగేశ్వర్ విశ్లేషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన విశ్లేషణ ప్రకారం.. రాజకీయల్లో అజెండా సెట్ చేసినవాడే నాయకుడు అవుతాడు.. విజయం సాధిస్తాడు.. ఎదుటి వాడు సెట్ చేసిన ఎజెండాను ఫాలో అయినవాడు పరాజయం పొందుతాడు.. ఇది ఎప్పటి నుంచో ఉన్నదే. 

ఏపీ విషయానికి వస్తే.. జగన్ ఎజెండా సెట్ చేస్తున్నాడు.. సీఎం చంద్రబాబు దాన్ని ఫాలో అవుతున్నాడు. ఇందుకు కనీసం నాలుగైదు ఉదాహరణలు చెప్పుకోవచ్చు.. ఏపీకి అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా విషయంలో జగన్ ఎజెండా సెట్ చేసాడు. ప్రత్యేక హోదా నినాదంతో ఉద్యమం ప్రారంభించాడు. కానీ దీన్ని మొదట చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించాడు. 

హోదా వస్తే ఏమొస్తుంది. ఆదే ప్యాకేజీ రూపంలో ఇస్తున్నప్పుడు హోదా ఎందుకు.. హోదా పేరెత్తితే జైల్లో పెడతా అంటూ రంకెలేశారు.. మళ్లీ నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు చంద్రబాబు కూడా ప్రత్యేక హోదా నినాదం ఎత్తుకున్నాడు.. నాలుగేళ్లు బీజేపీతో కలిసి ఉండి ఇప్పుడు మోడీని తిడుతున్నాడు.

బీజేపీపై పోరాడటం విషయంలోనూ జగనే అజెండా సెట్ చేశాడు.. మీరు ముందు కేబినెట్ నుంచి బయటకు వచ్చి పోరాడండి.. అన్నారు. కానీ చంద్రబాబు దాన్ని వ్యతిరేకించారు. మళ్లీ చివరకు నాలుగేళ్ల తర్వాత ఆయన జగన్ చెప్పినట్టుగానే కేబినెట్ నుంచి చంద్రబాబు టీమ్ బయటకు వచ్చింది. 

ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం విషయంలోనూ జగన్‌ అజెండా సెట్ చేశాడు.. పవన్ కల్యాణ్ విసిరిన సవాల్ కు స్పందిస్తూ మేం అవిశ్వాస తీర్మానం పెడతాం.. మీరు బాబుతో మద్దతు ఇప్పించండి అన్నాడు. అలాగే చేశారు. అప్పుడు.. అవిశ్వాసాన్ని చంద్రబాబు వ్యతిరేకించారు. కానీ ఆ తర్వాత మళ్లీ తానే అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి పోరాడుతున్నట్టు బిల్డప్ ఇచ్చారు.

ఆ తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలోనూ జగన్ అజెండ్ సెట్ చేసాడు.. చంద్రబాబు ఫాలో అయ్యాడు.. జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలను చంద్రబాబు ఏమాత్రం మొహమాటం లేకుండా కాపీ కొట్టేశాడు. అధికారపీఠం నుంచి దిగే సమయంలో నాలుగు నెలల ముందు పింఛన్ రెట్టింపు, పసుపు కుంకుమ అంటూ హడావిడి చేశారు. చివరకు మేని ఫెస్టో ప్రకటించే ముందు రోజు కూడా వైసీపీ అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టి తన మేనిఫెస్టోలో పెట్టారు. 

ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో ఉదాహరణలు.. సో.. దీన్నిబట్టి ఏపీ ప్రజలకు ఏం కావాలో ఎజెండా నిర్ణయించడంలో జగన్ లీడర్‌ గా ఎదిగారు. చంద్రబాబు ప్రజానాడిపట్టలేక జగన్ అడుగులో అడుగులు వేస్తూ ఫాలోవర్ గా మిగిలారు. అందుకే ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోబోతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: