Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 12:53 am IST

Menu &Sections

Search

పరనింద- స్వపొగడ్త-ఆరింద మాటలు-బోల్డు ప్రెస్ మీట్లు : ముగిసిన తెదేపా ప్రచారం

పరనింద- స్వపొగడ్త-ఆరింద మాటలు-బోల్డు ప్రెస్ మీట్లు : ముగిసిన తెదేపా ప్రచారం
పరనింద- స్వపొగడ్త-ఆరింద మాటలు-బోల్డు ప్రెస్ మీట్లు : ముగిసిన తెదేపా ప్రచారం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
‘తెలుగు దేశం పార్టీ’నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన నాటి నుంచి రాజకీయాల్లో - రాజకీయ ప్రచారంలో ఒక  ప్రత్యేక బాణీ ఏర్పరచిందని చెప్పడంలో తప్పేమీ లేదు.


చైతన్య రథమంటూ వ్యానెక్కినా, నడకంటూ నలుగురితో కాలు కలిపినా, సైకిల్ తొక్కినా అది అన్నగారికే చెల్లింది.  అన్నగారి ప్రచారం పంథా ఎప్పుడూ ప్రజలకు సాధ్యమైనంత దగ్గరగా తీసుకు వెళ్లేది.


ఇందిరాగాంధీ ని ఆడపడుచన్నా, రాజకీయా ప్రత్యర్థి పి.వి.ని తెలుగు ప్రధాని అన్నా అన్నగారి తార్కిక ఆలోచనల్లో తెలుగు దనం ప్రతిబంబించేది.
2019 ఎన్నికలల్లో తెదేపా ప్రచార శైలి మొత్తానికి అన్నగారి తెలుగు దేశాన్ని, అన్నగారి పంధాను మార్చేసింది.   అస్సలు ఇది తెలుగు దేశం పార్టీనేనా అన్నట్లనిపించింది.  అన్నగారు మనసు పెట్టి చేసిన పసుపు జెండా, పేదవాని ప్రతిబింబం సైకిల్ గుర్తు లేకపోతే ఇది తెదేపా అని గుర్తు పట్టటం కూడా కష్టమేనంటున్నారు ఆంధ్రప్రజ.


2019 ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి చంద్రబాబు నాయకత్వం మొత్తనికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేని లోటును తీర్చిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  నోటిఫికేషన్లు వచ్చి టిక్కెట్లు ప్రకటించడానికి, లీకులు, ఇదిగో సీటు - అదిగో సీటు అనడం చివరకు ఇవ్వకపోవడం.  క్యాండిడెట్లు, కార్యకర్తలు, చంద్రబాబు గారి ఇంటి ముందు ధర్నాలు చేయడం, మీడియా ముందు ఏడవడం, రహస్య ఫోన్ కాల్లు లీకవడం..కరెక్ట్ ఇది అంతా కాంగ్రెస్ విధానం కదా.. వైఎస్ఆర్ హయాం తేడా అనుకోండి. అలా తెదేపా చంద్రబాబు గారి నాయకత్వంలో పూర్తిగా రూపాంతంరం చెందిందంటున్నారు ఆంధ్రప్రజ.


ప్రెస్ మీట్-ప్రెస్ మీట్లే- ప్రెస్ మీట్లు -  2019 ఎన్నికలలో తెదేపా నాయకులన్ని ప్రెస్ మీట్లు ఆంధ్రలో మిగిలిన పార్టీలన్నీ కలిపినా పెట్టలేదంటున్నారు జర్నలిస్టులు. ప్రొద్దున్న నుండి - రాత్రి వరకు రక రకాల ప్రెస్ మీట్లు.  ప్రజలే దేవుళ్ళు-సమాజమే దేవాలయం అన్న వారి వద్దే తేల్చుకుంటామనే నందమూరి తారక రామారావు గారి నైజానికి ఎదురీత ఈ బుల్లితెర ప్రచార విధానం.. ఏదయినా మితం దాటితే మోహం మొత్తి - మొదటికే మోసం వస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


2019 ఎన్నికలలో చంద్రబాబు ప్రచార శైలి కూడా మొత్తానికి రూపాంతరం చెందింది,  నొప్పింపక-తానొవ్వక అన్నట్లుంటారు బాబు గారు అని అందరూ చెప్పకుంటారు.


అలాంటిది ఈసారి బాబు సవాళ్ళు, హెచ్చరికలు, శాపనార్థాలు, అఖరుకి శిస్సు వంచి పాదాభివందనాలు అన్ని చేసేశారు. అస్సలు నలభై ఏళ్ళ రాజకీయంలో మేము చూడని 70 ఏళ్ళ చంద్రబాబుని మొట్ట మొదలు చూశామంటున్నారు ఆంధ్రప్రజ.


అన్నింటికంటే ముఖ్యం బాబు చెప్పిన ఆరింద మాటలు.. కేసీఆర్ , మోదీ మిగిలిన ప్రపంచం అంతా ఆంధ్రుల్ని నాశనం చేయాలనకుంటుంటే తానొక్కడే కాపాడ్తున్నట్టు..తనకేం అవసరం చక్కగా మనవడితో ఆడుకోకుండా..70 ఏళ్ళ వయస్సులో కూడా తను కష్టపడుతున్నట్టు.. అది అంతా తెలగుు జాతి కోసమే తప్ప తనకేం స్వార్థం లేదంటూ చెప్పిన మాటలు వాటికి శివాజీ లాంటి ఏమి కాని వ్యక్తులు ఇచ్చిన ఇచ్చిన సర్టిఫికెట్లు.. బాబు స్థాయిని అధఃపాతాళానికి దించేశామనేది అసైన తెదేపా అభిమానుల మనోగతం.


చంద్రబాబు గారంటేనే నలబైఏళ్ళ చరిత్ర హైదరాబాద్ నేనే నిర్మించానని చెప్పే దగ్గర్నుండి అస్సలు సెల్ ఫోన్ నేనే తెచ్చా అనే వరకు బాబుగారి స్వపేక్ష గురించి చెప్పుకోవడం కూడా అవసరం అని షరా మామూలే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఐతే, ఆంధప్రజలు తెలివైన వారు, వారెవరివైపు ఉండబోతున్నారనేది , ఇంకొద్ది గంటల్లో ఈవీఎంలలో నిక్షిప్తమై మే 23 న నిజం బయటకు రాబోతుంది.ap-election-2019-lok-sabha-election-2019-ap-electi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.