ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక పోలింగ్ మిగిలింది. ఇప్పటికే రకరకాల సర్వేలు తమ తమ అభిప్రాయాలు చెబుతున్నారు. చాలా వరకూ ఇవన్నీ వైసీపీకి ఫేవర్ గానే ఉన్నాయి. ఇప్పుడు నాయకులు కూడా తమ లెక్కలు చెబుతున్నారు. 


తాజాగా.. వైసీపీ అధికార ప్రతినిధి లక్ష్మీపార్వతి తన అంచనాలు మీడియాకు వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని, వైసీపీకి 125కు పైగా అసెంబ్లీ సీట్లు, 19 నుంచి 22 ఎంపీ సీట్లు వస్తాయని  అన్నారు. జాతీయ చానెళ్ల సర్వేలు, వైసీపీ చేసిన సర్వేలో ఈ విషయం
వెల్లడైందని లక్ష్మీపార్వతి చెప్పారు. 

సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ మంచి మెజార్టీతో, ఓటింగ్ శాతంతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలు జగన్ వైపు ఉన్నారని ఆమె అన్నారు. ఇప్పటికే టీడీపీతో పోలిస్తే వైసీపీకి 10శాతం ఓటింగ్ పెరిగిందని లక్ష్మీపార్వతి అంచనా వేశారు. 

చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా గెలుపు మాత్రం జగన్ దేనని లక్ష్మీ పార్వతి అంటున్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనంతా మోసాలు, అబద్దాలే అని ఆమె మండిపడ్డారు. ఎస్సీ, కాపుల ఓట్లు చీల్చేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని.. కేఏ పాల్ ని, పవన్ కల్యాణ్ ని రంగంలోకి దించారని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: