పవన్ కళ్యాన్, చిరంజీవి సోదరునిగా నాగబాబు తర్వాత తెలుగు ప్రజలకు పరిచయమైన ఈ పేరు, నాగబాబు కంటే ఇంకా ఎక్కువ మాట్లాడ్తే చిరంజీవి కంటే ఎక్కవ నానుతోంది ప్రపంచ వ్యాప్త తెలుగు ప్రజల నోళ్ళలో. మహేష్ బాబు ‘అర్జున్’సినిమా పైరసీ ఆపినపుడుజరిగిన ఘటనల్లో మహేష్ పై పోలీసులు కేసులు పెట్టినపుడు జరిగిన ప్రెస్ మీట్ లో మొట్ట మొదటి సారి రుచి చూశారు పవన్ కళ్యాన్ ఆవేశాన్ని తెలుగు ప్రజ.


ఆనాటి నుంచి మోహన్ బాబు ను తమ్ముడు అన్నా తన పెళ్ళిళ్ళ గురించి, చిరంజీవి గారి అమ్మాయి అన్న మాటలకు తన తుపాకీని పోలీస్ స్టేషన్ లో అప్పజెప్పిన విధానం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో సందర్భాల్లో పవన్ లోని ఆవేశాన్ని వీక్షించారు తెలుగు ప్రజలు.


జనసేన పార్టీతో పవన్ రాజకీయ ప్రస్థానం ప్రారంభించి వత్సరాలవుతున్నా అడపా-దడపా ప్రజల్లోకి వెళ్లడం తప్ప... పూర్తి స్థాయి రాజకీయ నాయకునిగా పవన్ పని చేసింది మాత్రం 2019 ఎన్నికల్లోనే.  నోటిఫికేషన్ విడుదలకు కొన్ని వారాల ముందు హడావుడి మొదలు పెట్టిన జనసేన పార్టీ...నాదేండ్ల మనోహర్ చేరికతో పొత్తులు, ఒప్పందాలు మరింత సీజన్డ్ రాజకీయ పార్టీగా మారిందంటారు రాజకీయ విశ్లేషకులు.  


గత మూడు వారాలుగా పవన్ జనసేనకు అన్నీ తానై అన్నట్లు కాలికి బలపం కట్టుకొని మరీ తిరిగాడు, సభల్లో ప్రచారం చేశాడు.  అయితే అధికారం వెలగబెడుతున్నవారిని కాక ప్రతిపక్షం చేతకాని తనం అంటూ మాట్లాడిన మాటలు, జగన్ అవినీతి పరుడంటూ కోర్టు కంటూ ముందుగానే పవనే శిక్ష విధించినట్లు మాట్లాడుతునే కోర్టులు శిక్షలు విధించిన మాయావతి గారి కాళ్లు మొక్కటం ఈ మాత్రం దానికే జీవితం దారపోసినట్లు నిరస మొహం , బవిరి గడ్డం అన్నింటికంటే ముఖ్యంగా చంద్రబాబుని, తెదేపాని కంటికి రెప్పలా కాపాడతున్న విధానం, అలీని తను పుట్టిన రాజమండ్రి లో నానా మాటలన్న విధానాన్ని గురించి నానా రకాలుగా చెప్పుకుంటున్నారట ఆంధ్రప్రజ.


మరి ఈ పవన్ కళ్యాన్ ప్రచారాన్ని జనాలెంత నమ్ముతున్నారు, పవన్ వారికెంత కావాలనుకుంటున్నారనేది మరికొన్ని గంటల్లో ఈవీఏం లో మే 23 న ఫలితాల్లో చూడవలసిందే.  ఇండియాహెరాల్డ్ గ్రూప్ పవన్ కి, వారి జనసేన పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ..ఆల్ ది బెస్ట్ చెబుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: