ప్రచారపర్వం ముగింపు దశలో సోమవారం సాయంత్రం టీవీ 5 సంస్థ తన సర్వే ఫలితాలను ప్రకటించింది. ఈ సర్వే వివరాలు చూసే ముందు.. ఈ టీవీ చానల్ గత సర్వేల తీరు తెన్నులు ఓసారి పరిశీస్తే... ఈ సంస్థ గతంలో కర్ణాటక ఎన్నికల సమయంలోనూ.. 2014 ఎన్నికల సమయంలోనూ సరైన ఫలితాలే ఇచ్చింది.


కాబట్టి ఈ సంస్థ ఇచ్చే సర్వేలపై కాస్త నమ్మకం పెట్టుకోవచ్చు.. మొన్నటి ఓ పత్రిక ఇచ్చినట్టు దొంగ సర్వేల్లా ఈ సర్వేను అనుమానించాల్సిన అవసరం చాలా తక్కువ. ఇక సర్వే ఫలితాలు చూస్తే.. తెలుగుదేశానికి 105 స్థానాల వరకూ వస్తాయని ఈ సంస్థ అంచనా వేసింది. 


ఇక ప్రతిపక్ష వైసీపీ.. గతం కంటే తక్కువగా 65 స్థానాలకే పరిమితమవుతుందని ఈ సర్వే అంచనా వేసింది. ఇక జనసేన మూడు స్థానాల్లో గెలుస్తుందట. ఈ సంస్థ ఓటింగ్ శాతాలను కూడా ప్రసారం చేసింది. దీని ప్రకారం.. టీడీపీకి 44-46 శాతం ఓటింగ్ వస్తుందట. 

ఇక వైసీపీకి 41-43 శాతం.. జనసేనకు 8-10 శాతం ఓట్లు వస్తాయట. కానీ ఇక్కడో మెలిక కనిపిస్తోంది. ఓటింగ్ శాతంలో టీడీపీకీ, వైసీపీకి 2,3 శాతమే కనిపిస్తోంది. ఈ మాత్రం తేడాతోనే  దాదాపు 40 స్థానాలు తేడా వస్తున్నాయి. తెలుగుదేశం గెలవబోతోందని కాస్త కూస్తో క్రెడిబిలిటీ ఉన్న ఛానల్ చెప్పిన సర్వే ఇది. మరి ఎంతవరకూ నిజమవుతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: