ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబుకు కేంద్ర ఎన్నికల సంఘం మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే పోలీసు అధికారుల బదిలీల విషయంలో ఈసీ కొన్ని షాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత ఏకంగా చీఫ్ సెక్రటరీని కూడా బదిలీ చేసి అంతకుమించిన షాక్ ఇచ్చింది. 


ఇప్పుుడ ఇక సరిగ్గా పోలింగ్ కు 30 గంటల ముందు మరో షాక్ ఇచ్చింది. ప్రకాశం జిల్లా ఎస్పీని బదిలీ చేసింది. ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ ని మార్చాలని గత నెల 25న వైసీపీ నేతలు ఎన్నికల సంఘాన్ని కోరారు. కోయ ప్రవీణ్ తెలుగుదేశం నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. 

ఆ ఫిర్యాదు మేరకు ఇప్పుడు ఈసీ చర్య తీసుకుంది. వైసీపీ కార్యకర్తలను వేధించడం, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ ఫిర్యాదు చేసింది. తమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ పై అనవసర కేసులు పెడుతూ... ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని తన ఫిర్యాదులో పేర్కొంది వైసీపీ. 

వైసీపీ పిర్యాదు ఆధారంగానే ప్రకాశం ఎస్పీ కోయ ప్రవీణ్ ని బదిలీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు తాడేపల్లి, మంగళగిరి సీఐలను కూడా ఈసీ బదిలీ చేసింది. సరిగ్గా పోలింగ్ కు ముందు చేపట్టిన ఈ బదిలీలు.. పోలింగ్ పై ఏమేరకు ప్రభావం చూపుతాయో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: