ఏపీలో పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ.. పార్టీల అనుకూల మీడియాల రాద్దాంతాలు ఎక్కువవుతున్నాయి. కొన్నాళ్లుగా తెలుగుదేశం అనుకూల మీడియాల ద్వారా ఓ అంశాన్ని బాగా ప్రచారం చేస్తున్నారు. అదేంటంటే.. జగన్‌కు కొద్దిరోజులుగా ఎదురుగాలి వీస్తోంది అని. ఈ విషయాన్ని అనుకూల మీడియా ద్వారా కథనాల ద్వారా.. సర్వేల ద్వారా ప్రొజెక్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 


అయితే ఇక్కడ ఓ విశేషం ఉంది. సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది తప్ప..  ప్రతిపక్షానికి వ్యతిరేకత అంటే ఏంతో తెలియని పరిస్థితి. సాధారణంగా తెలుగుదేశం కు పరిస్థితి అనుకూలంగా ఉందని అని చెప్పుకోవచ్చు.. అదే నిజమైతే సర్కారు గ్రాఫ్ పెరిగినట్టు భావించాలి. 

అయితే తెలుగుదేశం మీడియా ఆ పని చేయకుండా ప్రతిపక్షానికి గ్రాఫ్ పడిపోయిందని ప్రచారం చేస్తున్నాయి. ఇక్కడే వారి డొల్లతనం బయటపడుతోంది. వివేకానంద హత్య, కేసీఆర్ బెదిరింపులు.. ఈ రెండు అంశాల కారణంగా జగన్ పట్ల వ్యతిరేకత పెరిగిందంటూ పసుపు మీడియా ప్రచారం చేస్తోంది. 

కానీ ఈ రెండు డొల్ల అంశాలే..వివేకా హత్య కేసులో ఇంకా ఎలాంటి పురోగతీ లేదు. మరోవైపు కేసీఆర్ బెదిరింపులే నిజమైతే.. ఆంధ్రాలోని పారిశ్రామిక వేత్తలు ఈపాటికే హైదరాబాద్ ఖాళీ చేసి ఉండాలి. అలాంటిదేమీ లేదు. సో.. ఇదంతా చంద్రబాబును గట్టెక్కించడానికి పసుపు మీడియా చేస్తున్న ప్రయత్నాలుగానే భావించాల్సి ఉంటుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: