జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా.. ఇది చాలామందికి ఆసక్తిరేపే ప్రశ్న. ఏనాటికైనా తాత ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి ఆయనే సరైన నాయకుడని చాలామంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ నమ్ముతారు. కానీ ఎన్టీఆర్ మాత్రం రాజకీయాలపై ఏమాత్రం కామెంట్ చేయడం లేదు.


తన మానాన తాను పని చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఎన్టీఆర్ రాజకీయాలపై మాత్రం కామెంట్స్ ఆగడం లేదు. ఎన్టీఆర్‌ ను రాజకీయాల్లోకి తెచ్చేందుకు ఆయన మేనత్త పురందేశ్వరి ఆమె ప్రయత్నిస్తున్నారని కూడా పుకార్లు వచ్చాయి. తాజాగా ఎన్టీఆర్ అత్త పురంధేశ్వరి ఓ ఇంటర్వ్యూలో ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. 

ఇంతవరకు ఎన్టీఆర్ తో రాజకీయపరమైన విషయాలు మాట్లాడలేదని క్లారిటీ పురందేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ కి సినీ పరిశ్రమలో చాలా భవిష్యత్తు ఉందని, సినిమాల్లో కొనసాగుతానని జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సందర్భాల్లో చెప్పిన విషయాన్ని పురందేశ్వరి గుర్తు చేశారు. 

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆయనకి దిశా నిర్దేశం చేసే వ్యక్తిగా పురందరేశ్వరి ఉంటుందా..? అనే ప్రశ్నకి బదులిస్తూ.. అంతటి గౌరవం ఇస్తే స్వాగతిస్తానని చెప్పారు. అన్ని విషయాలు విడమరిచి చెప్పడం బాధ్యతగా భావిస్తానని అన్నారు. అడగకుండా మాత్రం ఉచిత సలహాలు ఇవ్వనని పురందేశ్వరి  స్పష్టంగా తెలిపారు. ఏమో భవిష్యుత్‌లో ఎన్టీఆర్‌కు పురందేశ్వరి సలహాలు అవసరమవుతాయేమో.. ఎవరు చెప్పగలరు..?



మరింత సమాచారం తెలుసుకోండి: