అసలే ఎన్నికల సమయం.. అందివచ్చిన ఏ అవకాశాన్ని రాజకీయ నాయకులు అస్సలు వదులుకోరు. ప్రత్యర్థలు ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచుతారు. ఎక్కడ ఛాన్స్ దొరికినా దాన్ని రచ్చ రచ్చ చేస్తారు. ఇప్పుడు హిందూపురం నియోజకవర్గంలో జరుగుతున్నది అదే.


ఇటీవల బాలకృష్ణ తరచూ అభిమానులపై ఫైర్ అవుతున్నారు. చేయి కూడా చేసుకుంటున్నారు. జర్నలిస్టులు, అభిమానులు, ఇతరులు అన్న తేడా లేదు. పాపం బాలయ‌్య చర్యలతో టీడీపీ నేతలే బెంబేలెత్తే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఈ వీడియోలను ప్రత్యర్థులు అస్త్రాలుగా మలచుకుంటున్నారు. 

బాలయ్య వీడియోలను ప్రత్యర్థులు హిందూపూర్‌లో బాగా వైరల్ చేస్తున్నారు. ఇలాంటి నాయకుడిని ఎన్నుకుంటారా అంటూ రైటప్ యాడ్ చేసి ప్రచారం జోరుగా చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియోలు ఎక్కడ కొంప ముంచుతాయో అన్న కొత్త టెన్షన్‌ పట్టుకుంది బాలయ్య టీమ్‌కు.

హిందూపూర్ నందమూరి కుటుంబానికి పెట్టని కోట. గతంలో ఎన్టీఆర్, హరికృష్ణ ఇక్కడ గెలిచారు. అసలు ఇక్కడ తెలుగుదేశానికి ఓటమి అన్నదే లేదు. కాబట్టి భయపడాల్సిన పని లేదని చెబుతున్నా.. ఏదో మూల కాస్త భయం వెంటాడుతూనే ఉంది. ఏదేమైనా పోలింగ్ పూర్తయ్యే వరకూ బాలయ్య ప్రశాంతంగా ఉండాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: