ప్రచార పర్వం ముగిసింది. ఇక పోలింగుకు కౌంట్ డౌన్ మొదలైంది. మరి కొద్ది గంటల్లో ఏపీ జాతకం తేలబోతోంది. తమకు ఎవరైతే మేలు చేయనున్నారో ఆ నాయకుని పార్టీకి ఓటు వేసేందుకు జనం సిధ్ధంగా ఉన్నారు. ఈసారి ఎన్నికలు ఏపీకి సంబంధించి చాలా కీలకమైనవిగా చెప్పాలి.

 

ఇదిలా ఉండగా ప్రచారం ఇలా ముగియడంతోనే ప్రలోభాలకు తెర లేచింది. ఒక్కో ఓటుకు ఇంతా అంటూ రేటు కట్టేసి దళారీలు ఓటర్ల ముందుకు వస్తున్నారు. దాంతో ఓట్ల ముందు ప్రతీ కాలనీలో మరో రకం సందడి మొదలైపోయింది. ఓటుకు మీకెంత ఇచ్చారు. మాకెంత ఇచ్చారు ఇదీ పెద్ద చర్చగా సాగుతోంది. అదే విధంగా ఫలానా పార్టీ ఇంత మొత్తం ఇచ్చింది. మీరు తక్కువ ఇచ్చారేటి అంటూ నిగ్గదీస్తున్న సంఘటనలు చాలా జరుగుతున్నాయి.

 



ఇక మరో విశేషం ఏంటంటే అభ్యర్ధులు వారి మనుషుల ద్వారా ఈ ఓట్ల కొనుగోలుకు తెర లేపుతూంటే మధ్య దళారీలు దొరికింది దొరికినట్లుగా బొక్కేసి పంచేశామని చెబుతున్నారు. అయితే నోటు అందక ఇటు జనాలు, ఓట్లు దక్కన అటు అభ్యర్ధులు ఇద్దరూ షాక్ తింటూంటే మధ్యలో వాళ్ళు మాత్రం బాగానే పోగేసుకుంటున్న ఘటనలు చాల జరుగుతున్నాయి. గతసారి ఓ పార్టీ ఇలాగే సరిగ్గా డబ్బులు పంచలేకపోయింది. మధ్యవాళ్ళే తినేశారు. దాంతో ఘోరంగా ఓడిపోయింది. దాంతో ఇపుడు ఈ పంపిణీ వ్యవహారం గాడి తప్పితే అసలుకే ఎసరు అని కూడా భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: