మనది ఘనత వహించిన ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటాం. డెబ్బై ఏళ్ల నుంచి నిరాటంకంగా సాగుతున్న అతి పెద్ద ఓట్ల పండుగ అని కూడా జబ్బలు చరచుకుంటాం. కానీ ప్రతీ ఎన్నికకూ కొత్త కొత్త జబ్బులు పుట్టుకువస్తున్నాయి. వాటిని పరిష్కరించలేనంతగా పెరిగి పోతున్నాయి. మరింతగా వ్యాప్తి చెందుతున్నాయి.

 


నిజానికి ఒకప్పుడు ఓట్లు కొనుగోలు అన్నది గుట్టుగా సాగేది. ఇటీవల కాలంలో అది బాహాటంగా సాగుతోంది. పైగా ఓటుకు నోటు తమ హక్కు అని జనం భావిస్తున్నారంటేనే ప్రజాస్వామ్యం ఎంత గొప్పగా ఉందో అర్ధమవుతుంది. చదువు లేని వారు, నిరు పేదలు తాయిలాలకు ఆశ పడ్డారంటే అది తప్పైనా అర్ధం చేసుకోవచ్చు, కానీ బాగా మేధస్సు ఉన్న వారు కూడా ఇలా చేయడాన్ని ఏమనుకోవాలి.

 


విశాఖ వంటి మహా నగరంలో చాలా చోట్ల చదువుకున్న వారు సైతం ఓటుకు నోటు అంటూ లెక్క కడుతున్నారంటేనే బాధ కలుగుతుంది. తమకు ఇంత ఇస్తే వేస్తాం, లేకపోతే లేదంటూ ఈ చదువరులు డిమాండ్ చేయడాన్ని ఏ విధంగా అర్ధం చేసుకోవాలి. మా వైపు వచ్చిన వారు అపార్ట్మెంట్లలోకి ఎందుకు రాలేదని అక్కడ సంపన్న వర్గాలు నిలదీయడమూ ఈ ఎన్నికల్లోనే జరుగుతోంది.

 

మాకు కూడా అవసరాలు ఉండవనుకున్నారా అంటూ కోట్లకు పడగలెత్తిన వారు కూడా ఓటుకు నోటుకు ఎగబడడంటో ఓట్లు కొందామనుకునే వారికే దిమ్మ తిరిగిపోతోందట. ఈ విధనానం అంతకంతకు పెరిగి పెద్దదవుతోంది తప్ప ఆగడం లేదు. అవును మరి డబ్బు ఎవరైకైనా చేదా ఏంటి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: