నారా లోకేష్ మంగళగిరిలో పోటి చేయటానికి కారణం ఇది అంటూ ఓ విషయంపై నియెజకవర్గంలో బాగా చర్చ జరుగుతోంది.  రేపటి భూ సేకరణకు క్షేత్రస్ధాయిలో ఎటువంటి సమస్యలు ఎదురుకాకుండా చూసుకునేందుకు చంద్రబాబునాయుడు పెద్ద ప్లాన్ వేశారు. ఐదేళ్ళల్లో రాజధాని నిర్మాణం పేరుతో ప్రభుత్వం చాలామంది రైతుల నుండి బలవంతంగా వేలాది ఎకరాలను సేకరించింది. ఇందులో వివిధ కారణాల వల్ల స్వచ్చంధంగా ఇచ్చిన వారు కూడా ఉన్నారు. ఇవ్వటానికి ఇష్టపడని వారు కూడా ఉన్నారు.

 

ఎవరైతే భూములు ఇవ్వటానికి ఇష్టపడలేదో వాళ్ళల్లో చాలామంది నుండి ప్రభుత్వం బలవంతంగా లాగేసుకున్నది. మిగిలిన వారికి వైసిపి సిట్టింగ్ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి మద్దతుగా నిలిచారు.  భూముల విషయంలో ప్రభుత్వానికి  ఎదురుతిరిగిన వారి తరపున ఆళ్ళ కోర్టులో కేసులు వేశారు. దాంతో బలవంతపు భూ సేకరణను ప్రభుత్వం విరమించుకోవాల్సొచ్చింది.

 

ఇందులో మంగళగిరి నియోజకవర్గంలోని సుమారు 10 గ్రామాల్లో సుమారు 15 వేల మంది రైతులున్నారు. వీరంతా కూడా ప్రభుత్వానికి పూర్తిగా ఎదురుతిరిగారు. ఇటువంటి అనేక విషయాల్లో  చంద్రబాబు కంట్లో ఆళ్ళ నలుసులాగ తయరయ్యారు. అందుకే సొంత మనిషిని పెట్టుకోవాలని చంద్రబాబు అనుకున్నారు. అందుకే లోకేష్ ను పోటీ చేయిస్తున్నట్లు నియోజకవర్గంలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. అంటే రేపటి ఎన్నికల్లో  మళ్ళీ తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వస్తే  భూ సేకరణకు క్షేత్రస్ధాయిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకే లోకేష్ ను ఇక్కడి నుండి పోటి చేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: