ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. రమేశ్ రాథోడ్ ప్రయాణిస్తున్న వాహనం చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుకు అడ్డుగా  వచ్చిన పందిని తప్పించే క్రమంలో వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. తల, ఛాతి, కాలేయానికి తీవ్ర గాయాలయ్యాయి.  రమేశ్ రాథోడ్ తన ఎన్నికల ప్రచారం ముగించుకొని ఇంటికి తిరిగెళ్తుండగా మంగళవారం (ఏప్రిల్ 9) రాత్రి ఈ ప్రమాదానికి గురయ్యారు.


ఆదిలాబాద్‌లోని మావల గ్రామం వద్ద ప్రమాదం జరిగింది. కాగా,  రోడ్డుకు అడ్డంగా వచ్చిన పందిని తప్పించే క్రమంలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.  వైద్యులు రమేశ్ రాథోడ్ ని 48 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచారు. ఆయన ప్రాణానికి ముప్పేమీ లేదన్నారు. 2009 ఎన్నికల్లో రమేశ్ రాథోడ్.. టీడీపీ తరపున ఆదిలాబాద్ నుంచి లోక్‌సభకు ఎంపికయ్యారు.  


ఇక 2009 ఎన్నికల్లో రమేశ్ రాథోడ్.. టీడీపీ తరపున ఆదిలాబాద్ నుంచి లోక్‌సభకు ఎంపికయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం 2015లో ఆయన టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల సమయంలో ఖానాపూర్ స్థానం నుంచి టీఆర్‌ఎస్ పార్టీ తరఫున టికెట్ ఆశించి భంగపడ్డ రమేశ్ రాథోడ్.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ బరిలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: