రాజకీయ నాయకులు ప్రజలకు దర్శనం ఇచ్చేది సరిగ్గా ఎన్నికల సమయంలోనే.. ఆ తర్వాత కావాలన్నా వారి దర్శనం దొరకదు. ప్రజల సమస్యలు పట్టించుకోరు. అందుకే జనం కూడా తెలివిమీరారు. ఓటు కోసం వచ్చినప్పుడు నిలదీస్తున్నారు.


కొందరు నాయకులు అప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పేసి తప్పుకుంటుంటే.. మరికొందరు మాత్రం వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియాకు దొరికిపోతున్నారు. పాపం.. కైకలూరు టీడీపీ అభ్యర్థి జయమంగళం పని అలాగే అయ్యింది మరి. 

2014లో అబద్దపు హామీలతో టీడీపీ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తున్నారంటూ మండిపడుతున్నారు. కైకలూరులో ఎన్నికల ప్రచారానికి వచ్చిన టీడీపీ కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థి జయమంగళ వెంకటరమణను ప్రజలు నిలదీశారు.

2014 టీడీపీ మేనిఫెస్టోలోని ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదంటూ జనం ధ్వజమెత్తారు. దీంతో ఖంగుతిన్న జయమంగళ  సర్ధి చెప్పడానికి ప్రయత్నించారు. అయినా జనం శాంతించలేదు. 
అంతే.. పాపం ఆయనకు బీపీ రైజయ్యింది. అందరు మాట్లాడితే తానేమి చెప్పలేనని, ఏం మట్లాడకూ అంటూ గట్టిగా అరిచి చేతిలో మైకును తీసి జనాలపైకి విసిరారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడుసామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: