ఇప్పటికే పలు జాతీయ మీడియా సంస్థలు జగన్ గెలుపును ఖాయం చేసేశాయి. ఏదో ఒకటి రెండు చెబితే అనుకోవచ్చు కానీ.. దాదాపు నూటికి తొంబై శాతం జగన్ వైపే చెబుతూ.. ఆయన్ని హాట్ ఫేవర్ చేసేశాయి. ఇప్పుడు మరో జాతీయ సర్వే కూడా అదే చెబుతోంది. 


తాజాగా లోక్‌నీతి–సీఎస్‌డీఎస్‌–తిరంగ టీవీ–ది హిందూ–దైనిక్‌ భాస్కర్‌ ప్రీపోల్‌ సర్వేలోనూ రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ హవానే కొనసాగుతుందని కుండబద్దలు కొట్టేసింది.  దేశవ్యాప్తంగా మార్చి 24–31 తేదీల మధ్య దేశవ్యాప్తంగా ప్రీపోల్‌ సర్వేను ఈ సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి.  

ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 46 శాతం ఓట్లు వస్తాయట. అధికార టీడీపీ 36 శాతానికే పరిమితమవుతుందట. ఈ సర్వే ఫలితాలు నిజమైతే జగన్ ది ప్రభంజనమే అని చెప్పాలి. ఎందుకంటే.. దాదాపు 10 శాతం ఓటింగ్ తేడా అంటూ మామూలు విజయం కాదు. 

ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 108–124 సీట్లు వస్తాయని ఈ సర్వే వెల్లడించింది. టీడీపీ 41–57 సీట్లకు పరిమితమవుతుందని తేల్చింది. ఇక ఇతరులకు 5–10 స్థానాలు వచ్చే వీలుందని తెలిపింది. అంటే బహుశా ఇది జనసేన స్కోరు అయిఉండొచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: