తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల కమిషన్ పై సీరియస్ అయ్యారు. ఎన్నికల నేపథ్యంలో పలుచోట్ల అధికారులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్లడంతో ఈసీ వెంటనే సదరు అధికారులపై బదిలీలు వేటు వేయడంతో అధికార పార్టీ టిడిపి నేతలు ఎన్నికల కమిషన్ సరిగా బాధ్యతలు నిర్వర్తించడం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు.


గతంలోనే ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధికారంలో ఉన్న చంద్రబాబు ఎన్నికలను ప్రభావితం చేయటానికి మరియు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయటానికి తనకు అనుకూలంగా ఉండే అధికారులను ఎన్నికలు జరిగే సమయంలో పెద్ద పెద్ద పదవులలో కూర్చోబెట్టారని ఆరోపణలు చేసిన విషయం అందరికీ తెలిసిందే.


ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా కి సంబంధించిన ఓ అధికారి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ దృష్టికి వెల్లడి అవటంతో వెంటనే బదిలీ వేటు వేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల కమిషన్పై అసంతృప్తిగా ఉన్నట్లు ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కి సంబంధించిన ప్రధాన అధికారిని చంద్రబాబు ఈరోజు మధ్యాహ్నం కలవబోతున్న ట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వార్తలు వినపడుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: