తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు రేపు జరగబోతున్న నేపథ్యంలో అన్ని వైపుల నుంచి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్తులు రక రకాల జిమ్మిక్కులు చేస్తున్నారు.  ఓటర్లకు మద్య, డబ్బు, వస్తువులు పంచేందుకు ఏర్పాట్లు కూడా చేశారు.  ఇప్పటి కే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో డబ్బు పట్టుబడింది.  హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఎస్ఎల్ఎన్ టవర్స్ లో పోలీసులు సోదాలు నిర్వహించారు. 
 
కొండ విశ్వేశ్వరరెడ్డికి సమీప బంధువు అయిన సందీప్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి కోసం పనిచేస్తున్న సందీప్.  ఇప్పటి వరకు సందీప్ రూ.15 కోట్ల నగదును ఓటర్లకు పంచినట్లు గుర్తింపు. ఇప్పటి వరకు ఎవరెవరికి ఎంత డబ్బు ఇచ్చిందీ కోడ్ భాషలో రాసుకున్న సందీప్.   

స్వాదీనం చేసుకున్న డాక్యుమెంటును డీ కోడ్ చేస్తున్న పోలీసులు.  సందీప్ ని ప్రశ్నిస్తున్న ఐటీ అధికారులు.   కాగా, ఈ కేసులో సందీప్ రెడ్డి నుంచి కీలక పత్రాలు స్వాదీనం చేసుకున్నారు పోలీసులు.  సందీప్ రెడ్డి నుండి రూ. 10 లక్షలతో పాటు మూడు ల్యాప్‌టాప్‌లను కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: