ఎన్నికల సమయంలోనే కాదు..ప్రజాస్వౌమ్యంలో నాయకులందరూ జాగ్రత్తగా మాట్లాడాలి, తమ భావ వ్యక్తీకరణను ఉపయోగించే పదజాలం మంచిగా ఉండాలి.  ఎన్నికల సమయాల్లో అయితే సరేసరి. కోడ్ ఉండనే ఉంటుంది.


తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి మాటల మాంత్రికుడనే పేరుంది.  మాటలతో ప్రజలను సమ్మోహితులు చేయడం కూడా ఆయన నైపుణ్యత అంటారు.  తెలంగాణ ప్రజ, ఆయన రాజకీయ సహచర - ప్రత్యర్తులు.


అలాంటి కేసీఆర్ మీద ఎన్నికల కమీషన్ నోటీసు జారీ చేసింది.  ఒక సభలో ఆయన చేసిన హిందూ కాదు- బొందూ కాదు అన్న మాటల గురించి వివరణ కోరింది.


ఎలాగూ ఆ పద సరళిలో - మాండలీకంలో వచ్చిన మాటల గురించి కేసీఆర్ వివరణ ఇస్తారు కానీ.. ప్రజలకు దిక్సూచిలా ఉండవలసిన నాయకుల మాటలు ప్రవర్తనను వారు సరిచూసుకుంటే బావుంటుందేమోనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: