ప్రజాస్వౌమ్య పరిరక్షణలో మొదటిది - అత్యంత ముఖ్యమయినది ఎన్నికలు.  ఎన్ని లక్షల - కోట్ల మంది జీవితాలను, కుటుంబాలను పణంగా పెడితేనో మనకీ ప్రజాస్వౌమ్యం సిద్దించలేదు.


ఆంధ్రప్రదేశ్ లో తెల్లారితే ఎన్నికలు, ఇటువంటి సందర్భాల్లో ప్రజలలో భరోసా కల్పించి ఓటు హక్కు వినియోగించుకోవడానికి తగిన చర్యలు చేపడుతుంది ప్రభుత్వం...ఎన్నికల కమీషన్.


అట్లాంటి ఎన్నికల కమిషన్ మీద కూడా, సిబిఐ, ఐటి, ఈడి వంటి రాజ్యాంగ సంస్థల మీద చేసినట్లే కామెంట్లు చేయడం..సాక్షాత్తు ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆర్డర్లనే కాదు, కూడదు అంటూ కేసులు వేయించడం, ప్రభుత్వ తరుపున ఎన్నికల కమిషన్ ను సవాలు చేయడం..ఇలాంటి పోకడలు ప్రజాస్వౌమ్యానికి ఏ మాత్రం మంచిది కాదంటున్నారు ప్రజాస్వౌమ్యవాదులు.


సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎన్నికల కమిషన్ ను తప్పుబట్టడం, ఎన్నికల కమిషన్ కండక్ట్ ను ప్రశ్నించడం, ఎన్నికల కమిషన్ కు పారదర్శకంగా వ్యవహరించడం లేదంటూ ధర్నాలు చేయడం అదీ రాజ్యాంగ బద్దంగా జరుగుతున్న ఆదాయ పన్ను దాడులు ,  కొన్ని బదిలీల గురించి..అసలేమిటిదంగా అంటూ విస్తుతపోతున్నారు ఆంధ్రప్రజ.


అస్సలు ముఖ్యమంత్రి గారు చెప్పినట్లే నాలుగు బదిలీలు, మూడు వారాల ఆదాయపన్ను దాడులే ఇబ్బందయితే అయిదేళ్ళపాటు ప్రత్యర్థి పార్టీల వారిని వందల - వేల బదిలీలతో ఎంత ఇబ్బందికి గురి చేసుంటారో కదా అంటున్నారు ఆంధ్రప్రజ. 


మరింత సమాచారం తెలుసుకోండి: