Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Apr 22, 2019 | Last Updated 5:56 pm IST

Menu &Sections

Search

నలభై ఏళ్ళ చరిత్ర-డెబ్భైఏళ్ళ వయసు ఝడుసుకున్నట్లుందే!

నలభై ఏళ్ళ చరిత్ర-డెబ్భైఏళ్ళ వయసు ఝడుసుకున్నట్లుందే!
నలభై ఏళ్ళ చరిత్ర-డెబ్భైఏళ్ళ వయసు ఝడుసుకున్నట్లుందే!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఓడలు - బళ్ళు - ఓడలు అనేది చరిత్రకారులు ఆధారాలతో నిరూపించిన చారిత్రక సత్యం.  రోజులన్నీ ఒకే విధంగా ఉండవూ..పగటి సూర్యుడు, రాత్రి చంద్రుడు, కష్టం - సుఖం ఏది శాశ్వతం కాదు. అన్ని స్థితులలోనూ ప్రశాంతంగా ఉంటూ లక్ష్య సాధనకై కృషి చేయడమే స్థిత ప్రజ్ఞత అంటారు గీతాకారుడు.


మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము చెప్పినట్లే అన్నీ అవ్వాలి, మేము చేసిందే ధర్మం, చెప్పిందే న్యాయం అంటే ప్రజాస్వౌమ్యంలోనే కాదు తరాలనాటి రాచరికంలో కూడా చెల్లదు.


వయస్సు అనేది కేవలం శరీరానికి సంబంధించినది కాదు, ఆ వయస్సుకి తగ్గ విషయ పరిజ్ఞానం, మంచి - చెడు ల తేడా గ్రహింపు, వివేకం, వినయం, సచ్ఛీలత, దార్షనికతల మేళవింపు కాని బాహ్య పెరుగుదల మానవజాతి ఆహారంకు పనికొస్తుందేమో కానీ మానవ శ్రేయస్సుకు కాదు.


నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర అని చెప్పకునే ఘన 70 ఏళ్ళ నాయకుడి మాటలు, చేష్ఠలు, రాజ్యంగ సంస్థలపై వారు చేస్తున్న ఆరోపణలు వారి వయస్సుకి తగ్గట్లుగా లేవు సరికదా.. వారు ఎందుకు ఇంత ఘోరాతి - ఘోరంగా భయపడుతున్నారు అంటూ ఆశ్చర్యపోతున్నారు ఆంధ్రప్రజ.


గెలుపోటములు కావడి కుండలు, దైవమున్నపుడు దెయ్యమున్నట్లే.. గెలుపున్న చోట ఓటమి.  ఓటమిని హుందాగా తీసుకోనినాడు నాయకుడనే కనీస మర్యాదను కూడా కోల్పోతారు నాయకులంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 


ap-elections-ap-political-updates-telangana-politi
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

What you have to remember is that it isn't you who is being personally rejected. It simply means that a particular agent wasn't interested in what you wrote.