ఈ విధంగా చంద్రబాబునాయుడును ఎప్పుడైనా చూశారా ? చంద్రబాబును గడచిన 30 ఏళ్ళుగా చూస్తున్న వారు చాలా ఆశ్చర్యపోతున్నారు.  ఎన్నికల  ప్రచారంలో భాగంగా ఒంగి ఒంగి దండాలు పెడుతున్నాడు.  ఏ సభలో మాట్లాడినా, ఏ రోడ్డు షోలో పాల్గొన్నా చివరకు ఓట్లడిగే తీరు మాత్రం ఇదే. ఎందుకింతలా ఓటర్లను బ్రతిమలాడుకుంటున్నాడు ? చివరకు మోకాళ్ళ మీద కూడా కూర్చుని ఓట్లడుగుతున్నాడంటే పరిస్దితి ఎంత దయనీయంగా ఉందో అర్ధమైపోతోంది.

 

మామూలుగా వార్డు కౌన్సిలర్ గా పోటీ చేసే వ్యక్తి కానీ లేకపోతే సర్పంచుగా పోటీ చేస్తున్న వ్యక్తి కూడా ఇలా ఓటర్ల ముందు ఇలా ఒంగిపోడు. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా,  10 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా పనిచేసిన చంద్రబాబు ఎందుకింతగా దేబిరిస్తున్నడంటే ఓట్ల కోసమే. మూడోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన దగ్గర నుండి ఒక్కసారైన జనాలకు ఈ విధంగా నమస్కారం పెట్టాడా ? ఎక్కడా పెట్టలేదు సరికదా సమస్యలను చెప్పుకుందామని దగ్గరకు వచ్చిన నాయీ బ్రాహ్మణ సంఘాల నేతలను ఎంతలా చీదరించుకున్నాడో అందరూ చూసిందే.

 

ఒక్క నాయీ బ్రాహ్మణ సంఘాల నేతలనే కాదు తన దగ్గరకు వచ్చిన వాళ్ళల్లో చాలామందిని ఇదే విధంగా కసిరికొట్టాడు. ఐదేళ్ళు గిర్రున తిరిగి ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబుకు బొమ్మ అర్ధమైపోయింది. అందుకనే జనాలు తనను ఎక్కడ ఛీ కొడతారో అన్న భయంతో జనాలను ఇంతలా ఓట్ల కోసం బ్రతిమలాడుకుంటున్నారు.  దగ్గరకు వచ్చినపుడు ఛీ కొట్టి  తనవసరం కోసం ఒంగి ఒంగి దండాలు పెడుతున్న చంద్రబాబుకు జనాలు ఓట్లేస్తారా ? చూద్దాం కొద్ది గంటల్లో ఎటూ పోలింగ్ మొదలవుతోంది కదా ?

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: