‘అతి సర్వత్ర వర్జయేత్’ మోదాదు మించితే మందయినా విషమవుతుందని అనుభవపూర్వకంగా చెప్పారు మన పెద్దలు. బుల్లితెర  మన జీవితాన్ని మార్చేసిన ఒక వినూత్న ఆవిష్కరణ.  1980 వ దశకంలో ఎన్నికలంటే తాటాకు చలువ పందిళ్ళు, జెండా కర్రలు, గోడలకు పార్టీల పేర్లు, డప్పులు, మైకులు... ఇప్పుడు వాటన్నింటి స్థానాన్ని సింగిల్ గా ఆక్రమించుకుంది టివి.  


తెలుగు లో వినోద ఛానెళ్ళు ఎన్నున్నాయో వాటికంటే ఎక్కువ వార్త ఛానెళ్ళు ఉన్నాయి.  మూడు వారాల క్రితం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి ఈ వార్త ఛానెళ్ళలో దాదాపు 80 శాతంపైగా సర్వకాల - సర్వావస్థలలోనూ దర్శనమిచ్చింది తెలుగు దేశం పార్టీ.


కమర్షియల్ సినిమాల కంటే బ్రహాండమయిన 4 KHO క్వాలిటీలో తీసిన తెలుగు దేశం ప్రకటనలేవైతేనేమి? నాయకులు ప్రెస్ మీట్లయితేనేమి? టిడి వారు తెదేపా వారితో నిర్వహించే డిబేట్లయితేనేమి? సభలు, రోడ్ షోలయితేనేమి? వరుస ఖండనల ఫోన్ - ఇన్ అయితేనేమి? అన్నింటికి మించి ప్రెస్ మీట్లే - ప్రెస్ మీట్లయితేనేమి..తెదేపా అందుకల వాడిందు లేడను సందేహంబు వలదు ఎందెందు గాంచిన అందందు గలడు అన్నట్లు ఉందంటున్నారు ఆంధ్రప్రజ.


నిన్న సాయంత్రం ఆరుగంటలకు ప్రచార హోరు పోయి, మైకులు మూగబోయాయి,  పవన్ జనసే, కే.ఏ.పాల్ ప్రజాశాంతి, జగన్ వైసీపీ అ్ని కూడా అలానే ఉన్నా..తెదేపా మాత్రం యధావిధిగా అన్ని ఛానెళ్ళలోనూ దర్శనమిస్తుంది.  అందుకే వీరి తెలుగు దేశం పార్టీ కాదు టివిదేశం పార్టీ అంటున్నారు నవ్వుకుంటూ ఆంధ్రప్రజ.


మరింత సమాచారం తెలుసుకోండి: