ఏపీలో టిడిపి రాబోయే ఎన్నికలలో గెలవడానికి నానా తంటాలు పడుతోంది. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై పరిస్థితులపై ఎక్కడికక్కడ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఈసి కి వ్యతిరేకంగా ఎక్కడైనా అధికారులకు చుక్కలు చూపిస్తున్న క్రమంలో వెంటనే బదిలీలు కూడా చేస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి వెన్నులో వణుకు పడుతున్నట్లు తెలుస్తోంది.


ఇప్పటికే ఆయా జిల్లాలలో కొన్ని నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్నట్లు వెలుగులోకి రావడంతో అవే విషయాలు మీడియా లోకి రావడంతో వెంటనే ఎన్నికల కమిషన్ సదరు అధికారులపై బదిలీల వేటు వేస్తున్న నేపథ్యంలో టిడిపి పార్టీ పెద్దలు ఎన్నికల కమిషన్ దారుణంగా వ్యవహరిస్తుందని కామెంటు చేస్తున్నట్లు తెలుస్తోంది.


ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు చాలా కోపంగా ఉన్నట్లు ఏపీ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలు వింటున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరించడం దారుణమని వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరికి కొమ్ము కాయని ఎన్నికల కమిషన్ పైనే తెలుగుదేశం పార్టీ పోరాడతామని..ధర్నాలు చేస్తామని మాట్లాడటం మంచిది కాదంటూ మరికొంత మంది సీనియర్ సిటిజన్లు ఎన్నికల సమయంలో టిడిపి వ్యవహరిస్తున్న తీరుపై కామెంట్లు చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: