ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయాలను ఎలా అవకాశవాదంగా మార్చుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి. రాజకీయాలను పూర్తిగా అవకాశవాదంగా మార్చుకునే నైపుణ్యం చంద్రబాబుకు ఉన్నట్టు బహుశా దేశ రాజకీయాల్లో మరే నేతకి లేదేమో. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీని రకరకాలుగా మార్చేసినట్టు ప్రస్తుత ఎన్నికల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీని తెలుగు కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ తెలుగు, తెలుగు సేనగా మార్చేశారని ఆ పార్టీలోనే జోరుగా చర్చ నడుస్తోంది. త‌న రాజ‌కీయ అవ‌కాశం కోసం ఎంత‌టి వారిని అయినా అడ్డంగా తొక్కేస్తార‌ని... అలాగే త‌న‌కు బ‌ద్ధ విరోధుల‌తోనూ చేతులు క‌లుపుతార‌ని ఆయ‌న రాజ‌కీయ జీవితాన్ని చూస్తేనే తెలుస్తోంది.

Image result for chandrababu-congress-janasena

1983లో ఎన్టీఆర్‌ ఏ కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించారో చంద్రబాబు అదే కాంగ్రెస్‌ పార్టీతో తెలంగాణ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు. తెలంగాణ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో తెలుగుదేశం పొత్తు పెట్టుకోవ‌డం న‌ర‌న‌రానా ప‌సుపుర‌క్తం నింపుకున్న టీడీపీ వీరాభిమానుల‌కు ఏ మాత్రం న‌చ్చ‌లేదు. ఏపీని విభజించిన కాంగ్రెస్‌ పార్టీపై కాంగ్రెస్‌ ప్రత్యర్థి అయినా బీజేపీ నేతలైన ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాలు కూడా తిట్టని తిట్లు చంద్రబాబు తిట్టారు. గత ఏడాది జరిగిన తెలంగాణ ఎన్నికల్లో చివరకు అదే కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లి ఘోరంగా దెబ్బ తిన్నారు. ఇక తెలంగాణలో తెలుగుదేశం పేరును కాంగ్రెస్‌ తెలుగుగా మార్చేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చెయ్యని తెలుగుదేశం పరోక్షంగా కాంగ్రెస్‌కే సపోర్ట్‌ చేస్తుందన్నది బహిరంగ రహస్యం. 


ఏపీలో తెలుగుదేశం పేరును తెలుగు కాంగ్రెస్‌ అని మార్చుకోవాల్సిన అవసరం ఉంద‌న్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణలో బలంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి తెలుగుదేశాన్ని తాకట్టు పెట్టేలా చేసిన చంద్రబాబు... ఏపీలో బలహీనంగా ఉన్న కాంగ్రెస్‌ను బలోపితం చేసే బాధ్యతను తన భుజస్కందాల మీద వేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఒక్క సీటు గెలుచుకోకపోవడంతో ఏపీ అసెంబ్లీలో ఆ పార్టీ ప్రాధినిత్యమే లేదు. ఈ సారి ఒకటి రెండు నియోజకవర్గాల్లో ఇంకా చెప్పాలంటే కనీసం కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ కీలక నేత పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఆ కీలక నేతలను గెలిపించే బాధ్యతను సైతం చంద్రబాబు భుజస్కందాల మీద వేసుకున్నట్టు ఆ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లే చెవులు కొరుక్కుంటున్నారు. చంద్ర‌బాబు కావాల‌నే అక్క‌డ టీడీపీ త‌ర‌పున డ‌మ్మీ అభ్య‌ర్థిని నిల‌బెట్టార‌న్న ప్ర‌చారం ఆ పార్టీ వ‌ర్గాల్లోనే జ‌రుగుతోంది.

Image result for chandrababu-pavan

ఇక పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎందుకు వీక్‌గా ఉన్నారు, అక్కడ జనసేనను గెలిపించేందుకు టీడీపీ తెర వెనక ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది, అక్కడ చంద్రబాబు ఎందుకు ప్రచారం చెయ్యలేదు అన్న విషయం ప్రతి ఒక్కరికి అర్థమవుతోంది. ఈ రెండు పార్టీల మధ్య‌ ఏపీలో అన్ని నియోజకవర్గాల్లోనూ ఎలాంటి ఒప్పందం ఉందో రాజకీయంగా కొద్ది పాటి అనుభవం ఉన్న వ్యక్తికైనా అర్థం అవుతుంది. చంద్ర‌బాబు ఇంట‌ర్న‌ల్‌గా ప‌వ‌న్‌తో చేతులు క‌లిపి జనసేనకు ముందు తెలుగు చేర్చి జ‌న‌సేన పేరును కూడా తెలుగుసేనగా మార్చేశార‌న్న గుస‌గుస‌లు తెలుగు రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: