తెలుగుదేశం పార్టీని పెట్టిన వారు అన్న నందమూరి. ఆయనది సినిమాటిక్ పాలిటిక్స్. అప్పట్లో అంతా అలాగే అనే వారు. రామారావు గారు పాలనలో ఎన్నో రకాలుగా డ్రామా రక్తి కట్టేదని చెప్పుకునెవారు. అయితే ఎన్ని రకాలుగా విన్యాసాలు చేసినా అన్న గారు రాజకీయాలకు వాటిని  ఎపుడూవాడుకోలేదు.

 


కానీ ఆ అవకాశం మాత్రం అల్లుడు గారి నాయకత్వంలోని టీడీపీకి ఇచ్చేశారా అనిపిస్తోంది. బాబు ఏది చేసినా డ్రామా బాగా పండుతుంది. బాబు నా కంటే గొప్ప నటుడు అని స్వయంగా అన్న గారు అన్నారు మరి దాన్ని రుజువు చేస్తూ నిజం చేసేలా ఎన్నో ఎన్నెన్నో చేస్తూనే ఉన్నారు. ఇక ఎన్నికల కోడ్ ని తుంగలోకి తొక్కడంలోనూ బాబు గారు తనేంటో చెప్పకనే చెబుతున్నారు. ఈ దేశంలో ఆంద్ర్హప్రదేశ్ వేరు అన్నట్లుగా ఉంది ఆయన వైఖరి. కేంద్రం ఉండకూడదు, ఎన్నికల సంఘం ఉండకూడదు, ఈడీలు, సీబీఐలు ఏపీకి రాకూడదు. ఇదేం వింత రాజకీయమని ఎవరూ అడగకూడదు. ఎందుకంటే ఆ వ్యవ్ష్తలు అన్నీ పాడైపోయాయి. వాటిని రిపేర్ చేసే పనిలోనే బాబు గారు బిజీగా ఉన్నారు. అందుకే ఆయన చేస్తున్న ఆందోళలను ఎవరూ ప్రశ్నించరాదు.

 


పోలింగుకు నలభై ఎనిమిది గంటల ముందు ఎలాంటి ప్రచారం చేయరాదని కోడ్ క్లారిటీగా చెబుతున్నా బాబు గారికి పట్టింపు లేదు, ఆయన నిరసన పేరు పెట్టుకుని కెమెరాల ముందుకు వచ్చేశారు. రోజంతా తానే అనుకూల టీవీలో కనిపించాలి, తననే చూస్తూ జనం ఓటేయాలి. ఇదెక్కడ కోడ్ పాటించడం. మిగిలిన రాజకీయ పార్టీలకు ప్రచారం షెడ్యూల్ ఉంటుంది. బాబు గారికి ఉండవా. ఈసీ కోడ్ ఆయన పాటించరా. ఆయన అతీతుడా, ఈ హడావుడి ఏంటి పోలింగ్ ముందు ఇలా చేసి సానుభూతి సంపాదించుకోవాలని, పార్టీ గ్రాఫ్ పెంచుకోవాలని చూడడం బాబు గారు వంటి ప్రజాస్వామ్య ప్రియులకు తగునా.

 


టీడీపీ హడావుడి ఓ వైపు ఇలా ఉంటే, మరో వైపు కోడ్ ని కచ్చితంగా పాటిస్తూ వివేకంగా ఉన్న  వైసీపీ మరో వైపు కనిపిస్తోంది. మరి ఆంధ్ర ప్రజలు ఈ టైంలో ఏమి ఆలోచిస్తూంటారు. హడావుడి ఎవరిది,  మీడియా పైత్యం ఎక్కడికి పోతోంది. ఇవన్నీ లెక్కలు తీయరా. వాటికి జవాబు చెప్పరా.వైట్ అండ్ సీ.

 


మరింత సమాచారం తెలుసుకోండి: