మన ఘనమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో లోపాలను చూసుకుంటూ రాజకీయ ఘనాపాఠీలు సులువుగా ఎన్నికల కోడ్ ని ఉల్లంఘిస్తున్నారు. సర్వ స్వతంత్రమైన  ఎన్నికల వ్యవస్థ మనకు ఉన్నా ఇంకా అనేక సంస్కరణలు రావాల్సి వుందని మేధావులు అభిప్రాయడుతున్నారు. అపుడే అందరూ సమానంగా అవకాశాలు పొందుతూ ప్రచారం చేసుకోగలుగుతారని అంటున్నారు.

 


దేశంలో ఎన్నికలు ప్రకటించిన తరువాత ఆపద్ధర్మ ప్రభుత్వం ఉండకుండా వెంటనే రాష్ట్రపతి తన పరిధిలోకి పాలన మొత్తం తీసుకుని అధికారులతో నడిపించేలా రాజ్యాంగ సవరణలు చేయాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలను సైతం తొలగించి మూడు నెలల ముందు నుంచే గవర్నర్ పాలన్లోకి తీసుకురావాలి. ఆ విధంగా చేయడం వల్ల అధికార పార్టీ అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చు. అదే విధంగా ఎన్నికల్లో పోటీ చేసే అన్ని పార్టీలకు సమాన ప్రాతినిధ్యం ఉండాలి. మంత్రులు, ముఖ్యమంత్రులను మూడు నెలల ముందే తొలగి స్తే ఇక విధానపరమైన ప్రకటనలు చేసేందుకు వీలు లేకుండా ఉంటుంది. కోడ్ ఆఫ్ కాండక్ట్ నోటిఫికేషన్ కంటే ముందే అంటే కనీసం మూడు నెలల ముందే అమలులోకి తేవడం ద్వారా రాజకీయ పార్టీ అధినేతల అతి తెలివిని కట్టడి చేయాల్సి ఉంటుంది.

 

 

ఇక ఎవరైన కోడ్ ఉల్లంఘించినట్ల్గా తేలితే అతను ముఖ్యమంత్రి అభ్యర్ధి కానీవ్వడి, పెద్ద నాయకుడు కానీయండి వెంటనే అతనిపై కఠినమైన చర్యలు తీసుకుంటూ ఆరేళ్ళ కాలం  పాటు ఎన్నికల్లో పాల్గొనకుండా చేయాలి..  అపుడే కోడ్ ఉల్లఘించడానికి ఎంతటివారైనా భయపడతారు.ఆ విధంగా కూడా రాజ్యాంగ సవరణలు తేవాలి. ఇక ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో ఆరు నెలల నుంది స్వయంగా ఎన్నికల సంఘం నియంత్రణ చేస్తూ నగదు లావాదేవీల విషయంలో ద్రుష్టి, ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. అదే విధంగా అధికారులు ఏ పార్టీకైనా అనుకూలంగా వ్యవహరిస్తే వారిని సైతం కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలి.

ఎవరి సహకారం లేకుండా ఎన్నికల సంఘానికి ప్రత్యేక సిబ్భంది వ్యవస్థను కూడా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసుకోవాలి. దాని వల్ల పక్షపాతంతో వ్యవహరించే రాష్ట్రాల అధికారుల చేతిలో ప్రజాస్వామ్యం అపహాస్యం కాకుండా ఉంటుంది. వీలైనంత తొందరగా ఎన్నికల సంఘం సంస్కరణలు తీసుకురావాలి. అపుడే దేశంలో ప్రజలు కోరే అసలైన పాలన వస్తుంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: