2019 ఎన్నికల్లో జగన్ సీఎం కాబోతున్నాడని ఇప్పటికే పలు సర్వేలు చెప్పాయి. ఏ ఒక్క సర్వే కూడా టీడీపీ గెలుస్తుందని చెప్పలేకపోయింది. అయితే ఒక సర్వే మాత్రం అది రిపబ్లిక్ సర్వే టీడీపీ కి ఎక్కువగా పార్లమెంట్ స్థానాలు వస్తాయని చెప్పింది .అయితే ఆ సర్వేలో కూడా కాంగ్రెస్ కు పది శాతం ఓట్లు వస్తాయని చెప్పడంతో అందులో ఖచ్చితత్వం లేదని తేలింది. 

అయితే ఈ సర్వేలు ఇవన్నీ కాసేపు పక్కన పెడితే జ్యోతిష్యం శాస్త్రం ప్రకారం కూడా జగన్ సీఎం అవుతాడని చెబుతున్నారు. ఇప్పటికే పలు టీవీ ల్లో చూసే ఉంటారు. చంద్రబాబు ఈ సారి ఓడిపోతాడని జగన్ గెలుస్తాడని, ఇప్పుడు కూడా ప్రముఖ జ్యోతిష్య వేత్త గెలుపోటముల గురించి చెప్పారు. 


అతను చెప్పిన దాని ప్రకారం టీడీపీ పార్టీకి గెలిచే అవకాశాలు లేవని ఖచ్చితంగా ఓడిపోతాడని చెప్పారు. పార్టీ ఆవిర్భావం తేదీలు , నక్షత్రాలు అలాగే చంద్రబాబు పుట్టిన తేదీ ప్రకారం టీడీపీ పార్టీకి గ్రహాలు అనుకూలంగా లేవని చెప్పడం విశేషం. అదే మాదిరిగా జగన్ పార్టీ ఆవిర్భావం మరియు అతని పుట్టిన తేదీ ప్రకారం జగన్ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇలా ఎలా చూసిన చివరికి జ్యోతిష్యం ప్రకారం కూడా జగన్ సీఎం కావటం తధ్యమని అందరూ భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: