రాజకీయం లో తలపండిన నేత చంద్రబబునాయుడు అంటూ వ్యాఖ్యలు చేశారు ఉండవల్లి అరుణ్ కుమార్. అయితే ఈ వ్యాఖ్యాలు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, తను మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు లాంటి సీనియర్ నేత తమ రాష్ట్రంలో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ జరగకూడదని జి.ఓ. విడుదల చేయడం హాస్యాస్పదం అన్నారు. కోటీశ్వరుల పై ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ జరగడం అనేది సర్వసాధారణం.

దీని పై మీరెందుకు ఇంత హైరానా పడుతున్నారు. మీరు నిజాయితీ పరులు అయితే భయపడాల్సిన పనేముంది. మీ వెనకాల ప్రజలున్నారా, కోటీశ్వరులు ఉన్నరా.సెంట్రల్ వాళ్ళు పంపిన అధికారాలు  మన రాష్ట్రంలో సోదాలు చేయకూడదు అన్న మాటను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు అనడం ఈ రాష్ట్రానికే అవమానకరం. మీకు తెలిసి చేస్తున్నారా? తెలియక చేస్తున్నారా? ఏది ఏమైనా మీరు త్వరగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. 

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ మాట్లాడే ప్రతి మాట జాగ్రతగా మాట్లాడాలి. అన్ని పార్టీల తో పొత్తు పెట్టుకున్న ఏకైక నాయకుడు మీరు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటూ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. మోడీ గారితో పొత్తులో ఉన్నప్పుడు పొగిడి విడిపోయాక ముందు నుంచే నేను ఆయనను విమర్శిస్తున్న అనడం తప్పు అంటూ ఉండవల్లి అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: