హైదరాబాద్‌లో ఆంధ్రావాళ్లను అవమానిస్తున్నారు.. ఆంధ్రా వాళ్లను బెదిరిస్తున్నారు. ఆంధ్రాపారిశ్రామిక వేత్తలను భయపెడుతున్నారు.. ఖబడ్డార్‌ కేసీఆర్‌.. ఏమనుకుంటున్నావో.. మా ఆంధ్రావాళ్లజోలికొస్తే తాట తీస్తా.. 


హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడగొడతా.. నేను తలుచుకుంటే.. హైదరాబాద్ ఖాళీ అవుతుంది.. ఈ డైలాగులన్నీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇటీవల ఎన్నికల ప్రచారంలో చేసిన ప్రసంగాల్లోని ఆణిముత్యాలే. అయితే ఇదే సమయంలో అలాంటి హైదరాబాద్‌లో తన కుటుంబానికి చెందిన కంపెనీ హెరిటేజ్‌ ను మరింతగా విస్తరిస్తున్నారట. 

దాదాపు 15000 కోట్ల రూపాయలతో ఈ విస్తరణ జరగబోతోందట. 60 వేల కోట్ల రూపాయల టర్నోవర్ లక్ష్యమట. ఈ విషయాలు స్వయంగా నారాభువనేశ్వరి గారు స్టేట్‌ మెంట్ ద్వారా ఇచ్చినవే. మరి హైదరాబాద్ లో ఏపీ వాళ్ల పరిస్థితి అంత దారుణంగా ఉండే.. మళ్లీ చంద్రబాబు కుటుంబం హెరిటేజ్‌ను అక్కడే ఎందుకు విస్తరస్తోంది. ? 

పారిశ్రామిక వేత్తలందా ఆంధ్రా వచ్చి పెట్టుబడి పెట్టాలని దేశ, విదేశాలు తిరిగే చంద్రబాబు తన సొంత కంపెనీని ఎందుకు అమరావతికి తరలించలేకపోతున్నారు. పోనీ.. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రాపారిశ్రామిక వేత్తలనైనా ఎందుకు ఆకర్షించలేకపోయారు. వీటన్నంటికీ సమాధానం ఒక్కటే అసమర్థత, నిర్లక్ష్యం, ఆశ్రితపక్షపాతం అంటున్నారు కొందరు విశ్లే్షకులు. ముందు ఏపీకి హెరిటేజ్ తరలివస్తే.. ఆ తర్వాత మిగిలిన పరిశ్రమల గురించి ఆలోచించవచ్చని చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: