మన భారతీయులు అత్యధిక నమ్మకంతో తమ సొమ్మును పెట్టుబడి పెట్టేది బంగారంలోనే.. బంగారాన్ని ఓ వస్తువుగా కాకుండా.. ఓ నమ్మకమైన పెట్టుబడి సాధనంగా మనం ఎప్పటి నుంచో వాడుతున్నాం. అయితే ఇలాంటి బంగారం ఏమవుతుంది. నిరర్థకంగా పడి ఉంటుంది. 


దాచుకునే బంగారం వల్ల కానీ.. నగల వల్ల కానీ ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం ఉపయోగం లేదు. అదే బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి డబ్బు రూపంలో తీసుకువస్తే చాలా ఉపయోగం ఉంటుంది. ఇదే ఇప్పుడు ప్రభుత్వాలు బంగారం బాండ్లు జారీ చేస్తున్నాయి. 

ఇది కాస్త బాగానే సక్సస్ అయ్యింది. అందుకే గోల్డ్‌ మానిటైజేషన్‌ స్కీంలో భాగంగా ప్రభుత్వం మధ్యకాల, దీర్ఘకాల డిపాజిట్ల కింద సేకరించిన బంగారాన్ని విక్రయించాలని కేంద్రం నిర్ణయించిందట. ఈ క్రమంలో భాగంగా ఏకంగా ప్రభుత్వం 9,000 కిలోల బంగారాన్ని వేలం వేసిందట. 

ఈ విషయాన్ని ఆర్థిక శాఖ అధికారులు ధ్రువీకరించారు. ఈ వేలంతో వ్యవస్థలోకి నగదు ప్రవాహం పెరిగింది. ప్రభుత్వం గోల్డ్‌మానిటైజేషన్‌ స్కీం కింద మొత్తం ఫిబ్రవరి 20 నాటికి 15,650 కిలోల బంగారాన్ని సేకరించింది. అందులో 9 వేల కిలోలు వేలం వేశారట. అదీ సంగతి. 



మరింత సమాచారం తెలుసుకోండి: