రాజ్యాంగబద్ద సంస్థ అయిన ఎన్నికల సంఘంపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏకంగా ఈసీని మూసేయండి.. ఇంకా ఎందుకు మీరు.. అంటూ  రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి ద్వివేదిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇప్పుడు ఈ వీడియో అందర్నీ ఆశ్చర్యం కలిగిస్తోంది. 


ఎన్నికల కమిషన్ నిర్ణయాలపై ఫిర్యాదు చేయటానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం  సీఈవో గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు. తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా అందజేశారు. ఆ తర్వాత ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

చంద్రబాబు బెదిరిస్తున్నట్లు మాట్లాడుతుంటే ద్వివేది మాత్రం మౌనంగా వింటూ కూర్చున్నారు. ఇంతకీ చంద్రబాబు ఏమన్నారంటే.. 
" ఎవరు వెరిఫైంగ్ అథారిటీ అండీ. మీరు చూడాలి. లేదంటే వాళ్లు చూడాలి. నిజాలు చూడనివ్వండి. ఇక మీ ఆఫీస్ ఎందుకు?. క్లోజ్ చేసేయండి. ఎలక్షన్ కమిషన్ ఎవరు?. నేను అడుగుతున్నా. సరిగా కండక్ట్ చేయలేకపోతే. ఏకపక్షంగా చేయండి.

మిషన్లు పెట్టుకుని రిగ్గింగ్ చేసుకుంటారు. అయిపోతుంది దేశంలో ఎలక్షన్స్. మేం అందరం ఇంట్లో పడుకుంటాం. మేం ఎందుకు కష్టపడాలి. ఎందుకు ఈ మీటింగ్ లు మాకు. మేం అడిగేది ఏంటి? మీరు ఇండిపెండెంట్ ఆథారిటీ అవునా..కాదా?. ఢిల్లీ చెప్పినట్లు యాజ్ టీజ్ గా మీరు ఎందుకు ఫాలో కావాలి?.

మీ ఆత్మసాక్షిగా ఉందిగా. నేను అడుగుతున్నా. మీది పోస్ట్ ఆఫీస్ కాదు. మీకు అధికారాలు ఉన్నాయి. లేకపోతే రద్దు చేయమనండి. అందరినీ తీసేయమనండి. ఓ క్లర్క్ పెట్టుకుని చేసేయమనండి. మేం చూస్తాం. రేపు ఎలక్షన్ కమిషన్ ఏంటో. అంత ఈజీగా నేను వదిలిపెట్టను. నేను టేకప్ చేశానంటే లాజికల్ గా పోవాల్సిందే.. అంటూ చంద్రబాబు హెచ్చుస్వరంతో మాట్లాడారు. 


వీడియో కసం  ఈ లింక్‌ క్లిక్‌ చేయండి..

https://telugu.news18.com/videos/politics/abolish-election-commission-if-you-cant-handle-independent-says-chandrababu-naidu-ba-173850.html?utm_source=whatsapp


మరింత సమాచారం తెలుసుకోండి: