ఎన్నికల సంఘం.. ఒక రాజ్యాంగ బద్ద సంస్థ.. సజావుగా ఎన్నికలు జరిపించడానికి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి అన్ని ప్రభుత్వ పాలన వ్యవస్థలు ఈసీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఇది సాధారణంగా జరిగేదే.. ఏదైనా పార్టీ తమకు అన్యాయం జరుగుతుందని ఫిర్యాదు ఇస్తే తగిన చర్యలు తీసుకుంటుంటారు. 


కానీ.. ఈసారి ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఇఓ ద్వివేదిని కలిశారు. ఏకంగా ఈసీ కార్యాలయం దగ్గర ధర్నా కు కూర్చున్నారు. ద్వివేదికి వినతిపత్రం ఇచ్చారు. ఈ సీ వైఖరిపై ఆయన ముందే ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇలా ఒక ముఖ్యమంత్రి ఇలా సిఇఓ ని కలవడం ఇదే మొదటిసారి అని చంద్రబాబు అన్నారు.  విజయసాయిరెడ్డి, అనిల్ యాదవ్, భారతిరెడ్డి పిఎల ఆడియో టేప్ లు అంటూ ఒక పెన్ డ్రైవ్ ను ఆయన అందచేశారు.  వైఎస్ ఆర్ కాంగ్రెస్ పిర్యాదు చేసిన వెంటనే ఎన్నికల సంఘం స్పందిస్తోందని ఆయన అన్నారు. 

ఇంటెలెజెన్స్ డిజిని ఎలా బదిలీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఐబి కేంద్రంలో చేస్తున్నది ఏమిటని ఆయన అన్నారు. వివిపాట్ లు ఏభై శాతం లెక్కించాలని తాము కోరితే, బాలెట్ పత్రాలను ప్రవేశపెట్టాలని కోరితే ఎన్నికల సంఘం ఆమోదించలేదని చంద్రబాబు అన్నారు. ఇతర రాష్ట్రాలలో ఒక వైఖరి, ఏపిలో మరో వైఖరి అనుసరిస్తున్నదన్నారు. మొత్తానికి ఈసీ కార్యాలయం ముందు ధర్నా చేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు రికార్డుకెక్కారన్నమాట. 



మరింత సమాచారం తెలుసుకోండి: