గుంటూరు టీడీపీ  అభ్యర్థిగా పోటీ చేస్తున్న గల్లా జయదేవ్‌ సిబ్బంది ఇంటిపై మొన్న ఐటీ దాడులు జరిగాయి. సోదాలు నిర్వహించారు. దీనిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నాకు  కూడా దిగారు. చివరకు తన అసిస్టెంట్‌ ను పోలీసులు వదిలిపెట్టాక గల్లా జయదేవ్ ఆందోళన విరమించారు. 


ఐతే.. ఇదంతా డ్రామా అట.. నిజంగా ఐటీ దాడులు స్వచ్చంధంగా జరగలేదట. గల్లా జయదేవ్ మనుషులే ఐటీకి సమాచారం ఇచ్చి మరీ దాడులు చేయించుకున్నారట. గల్లా జయదేవ్ ఒక డ్రామా సృష్టించారని బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. 

గల్లా తన అనుచరులతో కలిసి వారే ఐటి వారికి సమాచారం అందించి, ఆ తర్వాత తన కార్యాలయంలో డ్రామా సృష్టించారని.. ఆయన అంటున్నారు. ఓటమి భయంతో ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని కన్నా అన్నారు. 

డ్రామాల్లో భాగంగానే ఎన్నికల వ్యవస్థను,రాజ్యాంగ సంస్థలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కన్నా విమర్శించారు. డిఎస్పిల పర్యవేక్షణలో పోలీసులు టిడిపి డబ్బు పంపిణీ చేస్తున్నారని, వాటిని తనఖీ చేయడం లేదని కన్నా మండిపడ్డారు. దొంగే దొంగ అన్నట్లు ఈసిని పార్టీలకు అంటగట్టి బ్లాక్ మెయిల్ చేయడానికి చంద్రబాబు యత్నిస్తున్నారని కన్నా ఘాటుగా మండిపడ్డారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: