విభజన తరువాత ఏపీఎకి జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి. అయిదేళ్ళ పాలను జనం చూశారు. వారి ఆశలు, ఆకాంక్షలు ఎంతమేరకు నెరవేరాయని బేరీజు వేసుకుని మరీ తీర్పు ఇచ్చేందుకు సిధ్ధంగా ఉన్నారు. దాదాపుగా నాలుగు కోట్ల మంది ఓటర్లు తమ భవిష్యత్తుని ఈసారి నిర్ణయించుకోనున్నారు.

 

ఏపీలో ఎవరు కొత్త ముఖ్యమంత్రి. దీని మీద అనేక సర్వేలు ఇప్పటికే వెలువడ్డాయి. మెజారిటీ సీట్లు ఎవరికి వస్తాయని కూడా చూచాయగా చెప్పాయి. ఐతే అసలైన అవకాశం, అధికారం జనాలకు ఉంది.దాంతో ఏపీ ప్రజలు  కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నది ఈ రోజు చెప్పనున్నారు. తమ ఓటు హక్కుని వినియోగించుకోవడం ద్వారా ప్రజలు తమకు కావాల్సిన నాయకున్ని ఎన్నుకోనున్నారు.

 

ఏపీకి ఎవరు మేలు చేస్తారు, ఎవరి వల్ల  విభజన హామీలు నెరవేరుతాయన్నది కూడా జనం గుర్తించి తమ ఓటు అనే బ్రహ్మాస్త్రాన్ని గురి పెట్టనున్నారు. ఏపీలో మార్పునకు నాందిగా ఓటు  హక్కుతో దశ, దిశ మార్చనున్నారు. ఏపీ ముఖ్యమంత్రి ఎవరన్నది తేల్చడంతో పాటు, రానున్న రోజుల్లో కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వంలో ఏపీకి సంబంధించి కీలక పాత్ర ఏమిటి అన్నది కూడా ఆంధ్ర ప్రదేశ్ ఓటర్లు చెప్పనున్నారు. మొత్తానికి ఓటరుకి మాత్రమే తెలిసిన ఏపీ కొత్త సీఎం అంతే గుట్టుగా ఈవీఎం లలో ఆ పేరు చేరిపోనుంది. ఫలితాల తరువాతనే ఆ రహస్యం బయటపడనుంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: