దేశంలో సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది.  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మొత్తం 18 రాష్ట్రాల్లో 91 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఇక దేశ వ్యాప్తంగా చూస్తే..తెలుగు రాష్ట్రాలతో సహ ఏపీలో 25, తెలంగాణలో 17, యూపీలో 8, మహారాష్ట్రలో 7, అసోంలో 5, ఉత్తరాఖండ్‌లో 5, ఒడిశాలో 4, బీహార్‌లో 4, పశ్చిమబెంగాల్‌లో 2, అరుణాచల్‌ప్రదేశ్‌లో 2, చత్తీస్‌గఢ్‌లో 1, జమ్ముకశ్మీర్‌లో 2, మణిపూర్‌, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్, లక్షద్వీప్‌లలో ఒక్కో స్థానంలో పోలింగ్ జరగనుంది.


లోక్‌సభ ఎన్నికల్లో తొలివిడత పోలింగ్ మొదలైంది. మీరు ఈ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా? ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకున్నారా? అసలు మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడో తెలుసా? ఇప్పటికీ తెలుసుకోకపోతే వెంటనే అప్రమత్తమవండి.  దగ్గరలోని పోలింగ్ బూత్ వద్దకు కానీ...ఏజెన్సీ వద్దకు కాని వెల్లి మీ వివరాలు తెలిపి ఓటు హక్కును వినియోగించుకోండి.


11:58pm:  : పెద్దపల్లి 27.08%, మెదక్ 36.04%, చేవెళ్ల 18.20%, మహబూబ్ నగర్ 27%, నాగర్ కర్నూలు 30.16%, వరంగల్ 25.97% , మహబూబ్ బాద్ 32.19%, ఖమ్మం 24%, ఆదిలాబాద్ 27.85%



11:55 pm:  ఎన్నికల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మంగళగిరి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ధర్నాకు దిగారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించినా పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. 


11:55 am:  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వల్లే ప్రత్యేక హోదా ఉద్యమం సజీవంగా ఉందని, ప్రతి జిల్లాలనూ యువభేరి కార్యక్రమాలతో హోదా పట్ల యువతలో వైఎస్‌ జగన్‌ అవగాహన పెంచారని వైఎస్‌ జగన్‌ సోదరి వైఎస్‌ షర్మిల తెలిపారు.


11:50 am:   కడప జిల్లా గుండాలపల్లెలో మధ్యాహ్నం 12 గంటలు కావొస్తున్నా ఇప్పటికీ పోలింగ్ ప్రారంభం కాలేదు. వీవీ ప్యాట్ మొరాయించడంతో అధికారులు పోలింగ్‌ను ప్రారంభించలేదు.


11:45 am:  పశ్చిమగోదావరి జిల్లా దువ్వలో విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని 15వ పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేయడానికి వచ్చిన బండారు ముసలయ్య అనే వ్యక్తి మృతి చెందాడు.


10:45am : ఐరాలం మండల నాంపల్లి, పేరయ్యగారిపల్లి, కమ్మకిందపల్లిలో ఓటు వేసేందుకు వెళుతున్న దళితులను అడ్డుకున్న టీడీపీ..ఉద్రిక్తత


10:35am : అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సనపలోని ఓ పోలింగ్ కేంద్రంలో పరిటాల అనుచరులు ఈవీఎంలను ధ్వంసం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. 


10:25am :  కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అహోబిలంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. భూమా, గంగుల వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఇరు వర్గాలు రాళ్ల దాడికి దిగాయి. ఈ దాడిలో మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్, ఆమె సోదరి మోనికకు గాయాలయ్యాయి. 


9:55am :  పొట్లదుర్తిలో టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ దౌర్జన్యానికి దిగారు. పొట్లదుర్తిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌  పార్టీ ఏజెంట్‌పై సీఎం రమేశ్‌ చేయి చేసుకున్నారు.

9:45am :  సంతబొమ్మాలి మండలం నిమ్మడలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఎన్నికల సిబ్బందిపై అచ్చెన్నాయుడు అనుచరులు బెదిరింపులకు దిగారు. నిమ్మడ పోలింగ్‌ కేంద్రంలో వెబ్‌ కెమెరాలను తొలగించి వైఎస్సార్‌ సీపీ ఏజెంట్‌ను బయటకు వెళ్లాలని హుకుం జారీ చేశారు. 


9:35am :  ఎన్నికల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మంగళగిరి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ధర్నాకు దిగారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించినా పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. 


9:30am :  జమ్మలమడుగు మండలం పొన్నతోట పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ దౌర్జన్యానికి దిగిన టీడీపీ నేతలు ఏకంగా పోలింగ్‌ను అడ్డుకున్నారు. 


8:42am : ఉత్తరాంధ్ర మూడు జిల్లాలో చాలా ప్రాంతాల్లో ప్రారంభం కాని పోలింగ్


8:38am : అన్ని జిల్లాల్లో ఏదో ఓ చోట పని చేయని ఈవీఎం, వీవీ ప్యాట్లు, పలు చోట్లు ఇంకా ప్రారంభం కాని పోలింగ్.. సాంకేతిక సమస్యలను సరి చేస్తున్న సిబ్బంది. కొన్ని చోట్ల ఈవీఎం లు పనిచేయక పోవడంతో వెనుతిరిగిన ఓటర్లు


8:35am :తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి కేశినేని నేని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుణదల సెయింట్ జోసెఫ్ బాలికల ఉన్నత పాఠశాలలో కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు.


8:35am : తెలంగాణ లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మల్కాజ్‌గిరి నియోజకవర్గం పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో  విద్యుత్  సరఫరా లేదు. ఎల్భీనగర్ గణేశ్ నగర్ కమ్యూనిటీ హాల్‌లో కొవ్వొత్తుల సాయంతో మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు. 


8:32am : నర్సారావుపేట మండలం యలమందలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ముగ్గురు వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బూత్‌లోకి వెళ్లకుండా అడ్డుకొని.. వారిని టీడీపీ నేతలు కిడ్నాప్‌ చేశారు. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై టీడీపీ నేతలు దాడికి దిగారు. దీంతో ఒక ఏజెంట్‌ గాయపడ్డారు. 


8:29am : పశ్చిమగోదావరి  జిల్లా..  ఉండి నియోజకవర్గంలో 7.10 గంటలు దాటినా పోలింగ్ ప్రారంభంకాలేదు.


8:27am క్యూలైన్‌లో నిల్చుని.. ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ గౌవర అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ


8:25am :చిత్తూరు మండలం ఎర్రతివారిపల్లెలోనూ ఈవీఎంలు పనిచేయకపోవడంతో పుంగనూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి, తంబళ్లపల్లి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి క్యూలైన్‌లో నిల్చున్నారు. 


8:23am :రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా 50 ఈవీఎంలు మొరాయించాయని ఎన్నికల అధికారి గోపాల క్రిష్ణ  ద్వివేది తెలిపారు. తాడేపల్లి క్రిస్టియన్‌పేటలోని మున్సిపల్ హై స్కూల్ లో ఓటు వేశారు. మొరాయించిన ఈవీఎంలను టెక్నికల్‌ టీమ్‌ రిపేర్‌ చేస్తారని చెప్పారు. 


8:21am :సిద్దిపేట భరత్ నగర్ లో ఓటు వేసిన మాజీ మంత్రి హరీష్ రావు.  


8:20am :ఏపి, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ స్థానాలకు పోలింగ్,  మొత్తం ఓటర్ల సంఖ్య 14.21 కోట్ల ఓటర్లు.


8:15am : నిజామాబాద్ ఎంపీ స్థానంలో 185 మంది పోటీ..నిజామాబాద్ ఎన్నికలపైనే అందరి ఫోకస్.


8:12 am :కుటుంబ సమేతంగా వెళ్లి క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకుంటున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆయన వెంటన తల్లి, భార్య ఉన్నారు.  ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత.. సామాన్యల నుండి సెలబ్రెటీలు సైతం తమ ఓటు తప్పకుండా వినియోగించుకోవాలి : ఎన్టీఆర్ 


7:58 am :జనం మార్పు కోరుకుంటున్నారు..ఎలాంటి ఇబ్బందులు ఉన్న అధికారులకు తెలపండి..ఓటు హక్కు వినియోగించుకోండి : వైఎస్ జగన్,   ఓటు హక్కు వినియోగించుకున్న కేవీపీ దంపతులు.


7:56 am :ఓటు విలువ ఎంతో గొప్పది..రాజకీయాలు శాసించేది..ప్రతి ఒక్కరూ విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి, హైదరాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్న అల్లు అర్జున్ 


7:55 am :ఇవాళ చాలా పవిత్రమైన రోజు..ప్రతి ఒక్కరూ తమ ఓటు వినియోగించుకోవాలి : నారా లోకేష్ బాబు


7:50 am :మంగళగిరి లో ఓటు హక్కు వినియోగించుకున్న ఏపి సీఎం చంద్రబాబు, కుటుంబ సమేతంగా వెళ్లి ఓటు వేసిన చంద్రబాబు నాయుడు. బాబు వెంట, భువనేశ్వరి, కొడుకు లోకేష్ బాబు, కోడలు బ్రహ్మణి


7:50 am :పార్వతీపురం 38వ పోలింగ్ బూత్ లో మాక్ పోలింగ్‌లో ఈవీఎం మొరాయించింది. అనంతపురం అర్బన్ నియోజకవ


7:45 am :పార్వతీపురం 38వ పోలింగ్ బూత్ లో మాక్ పోలింగ్‌లో ఈవీఎం మొరాయించింది. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని 122వ పోలింగ్ కేంద్రంలోఈవీఎం మొరాయించింది. 


7:35 am :గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఈవీఎంలు పనిచేయడం లేదు. తాడేపల్లిలోని 10 పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. పోలింగ్‌ బూగ్‌ నంబర్లు 20,24,26, 39,27, 51, 54, 69 లో ఈవీఎంలు పనిచేయడం పనిచేయడం లేదు. 


7:35 am :కాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలోని సింధువాడ పంచాయతీ 181 పోలింగ్ కేంద్రంలో ఎంపీ బ్యాలెట్ యూనిట్‌కు బ్యాటరీ ఇవ్వకుండా అధికారులు ఈవీఎంను పంపారు. దీంతో మాక్ పోలింగ్ నిలిచిపోయింది.


7:33 am : ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లాలోని పులివెందులలో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ సరళిని పర్యవేక్షించిన జగన్..ఓటర్లు నిర్భంగా తమ ఓటు వినియోగించుకోవాలని పిలుపు.   ఓటు హక్కును వినియోగించుకున్న వైఎస్‌ జగన్‌, వైఎస్‌ భారతి


7:15 am : గుంటూరు : నరసరావు పేట (మ) యలమందలో ఉద్రిక్తం వైసీపీ బూత్ ఏజెంట్లతో టీడీపీ కార్యకర్తల వాగ్వాదం. తమ ఏజెంట్లను నిర్భందించారని వైసీపీ కార్యకర్తల ఆరోపణ.


7:05 am :తిరుపతిలో మొరాయించిన ఈవీఎంలు, పోలింగ్ ప్రక్రియ ఆలస్యం.   రాప్తాడు లో గాండ్లపర్తిలో పనిచేయని ఈవీఎంలు. పుట్టపర్తిలోని కొట్లపల్లిలో బూత్ నంబర్ 117 మొరాయించిన ఈవీఎలు.


6:45 am : కృష్ణా జిల్లాలోని మూడు నియోజకవర్గాలు విజయవాడ సెంట్రల్, విజయవాడ పశ్చిమ, మైలవరం నియోజకవర్గాల్లో రెండేసి ఈవీఎంలు ఉపయోగించనున్నారు. ఇక్కడ 15 మంది కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో ఈ పరిస్థితి నెలకొంది.


6:30 am : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 46,120 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ద్వివేదీ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: