ఎన్నికల సమయంలో ఫిర్యాదులు వచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవడం అత్యంత సహజమైన పరిణామం.. ప్రతి ఎన్నికలప్పుడు జరిగేదే.. కానీ ఓ నలుగురు అధికారులను బదిలీ చేశారన్న కారణంతో సీఎం చంద్రబాబు నానా రచ్చ చేస్తున్నారు. ఏకంగా ఈసీ ముందే ధర్నాకు దిగారు. 


అలా బదిలీ చేయడం వల్ల ఏమవుతుంది.. ఆ అధికారులకు జీతాలేమీ తగ్గవు.. అదేమీ పనిష్‌ మెంట్ కాదు.. పనులేమీ ఆగిపోవు.. ఇవన్నీ చంద్రబాబుకూ తెలుసు. ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనా అలాంటి ఫిర్యాదులు చేశారు. 

ఆయన ఫిర్యాదులపై ఏకంగా.. డీజీపీనే బదిలీ చేశారు.  అప్పుడు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. అది 2009 సంవత్సరం. ఎన్నికల సమయం. అప్పుడు ఇదే చంద్రబాబు టీమ్ అప్పటి డీజీపీపై ఆరోపణలు చేసింది. ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈసీ డీజీపీని బదిలీ చేసింది. 

అప్పుడు సీఎంగా ఉన్న రాజశేఖర్ రెడ్డి దీనిపై హుందాగా వ్యవహరించారు. అదే సీఎం వైఎస్.. మళ్లీ ఎన్నికలు కాగానే మళ్లీ తాను ముఖ్యమంత్రి కాగానే పాత డీజీపీనే మళ్లీ డీజీపీగా నియమించుకున్నారు. ఒక ఘటనకు స్పందించే విధానాన్ని బట్టే వారి వ్యక్తిత్వాన్ని నాయకత్వ లక్షణాలను అంచనా వేయవచ్చు. 

40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే ఏపీ సీఎం చంద్రబాబు... ఈసీ తీసుకున్న  బదిలీలపై నానా రచ్చ చేస్తున్నారు. తనకు ఎవరు నచ్చకపోతే వారు మోడీతో కుమ్మక్కయ్యారని అనడం ఇటీవల చంద్రబాబుకు అలవాటుగా మారిపోయింది. మరి ఆ నలుగురు అధికారుల కోసం చంద్రబాబు ఇంతగా దిగజారాలా అన్నది విశ్లేషకుల ప్రశ్న. 



మరింత సమాచారం తెలుసుకోండి: