ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పచ్చ పార్టీ నేతలు చేస్తున్న దాష్టికాలు రోజురోజుకు శృతి మించుతున్నాయి. రెండు రోజుల ముందు విజయసాయి రెడ్డి , అనిల్ కుమార్ యాదవ్ మీద ఒక ఫేక్ ఆడియోకు తెరలేపి మిమిక్రి ఆర్టిస్టులు చేత చేయించి ఎన్నికల్లో గెలవాలని కుట్ర పన్నారు. దానికి సంభందించిన నారాయణ పిఏ ఆడియో టేప్ ఇప్పుడు బట్ట బయలు అయ్యింది. ఆ ఆడియో టేప్ లో మాట్లాడుతూ మనం అనుకున్న విధంగా రికార్డింగ్స్ బాగా వచ్చాయని మాట్లాడినారు. 


జనాలు వాటిని బాగా నమ్మేశారని, నారాయణ సర్ చాలా చాలా హ్యాపీగా ఉన్నారని పీఏ మాట్లాడటం స్పష్టంగా రికార్డు అయ్యింది. దీనితో పచ్చ కుట్రలు బయటపడటంతో ఇప్పుడు నారాయణ ఉన్న పరువు పోగొట్టుకున్నారు. అయితే ఇప్పుడు నారాయణ ప్రత్యక్ష ఎన్నికల్లో నెల్లూరు అర్బన్ లో పోటీ చేయబోతున్నాడు. అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు. రాష్ట్రంలో అత్యంత ఖరీదైన నియోజకవర్గంగా దీనిని చెప్పుకోవచ్చు.


అందుకు కారణం.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మంత్రి నారాయణ పోటీ చేస్తూ ఉండటమే! ప్రత్యక్ష రాజకీయాల వైపు వచ్చాకా టీడీపీ తరఫున నామినేటెడ్ పదవిని తీసుకుని మంత్రి అయ్యారు నారాయణ. అలా తెలుగుదేశంపై తనకున్న పట్టేమిటో నిరూపించుకున్నారు. ఇక అంతటితో ఆగక.. నారాయణ ప్రత్యక్ష రాజకీయంలోకి ఎంట్రీ ఇచ్చారంటే.. ఆయన తన విజయం మీద ఎంత నమ్మకంతో ఉన్నారో, ఎంత ప్రతిష్టగా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. విద్యాసంస్థల యజమానిగా ఉన్నప్పుడు ‘నెల్లూరు నారాయణ’గా ఫేమస్ అయిన ఈయన ఇప్పుడు నెల్లూరు అర్బన్ నుంచినే తనసత్తా చూపించబోతూ ఉన్నారు. దీనికోసం పక్కా ప్రణాళికతో ఉన్నారాయన. అయితే ఇప్పుడు ఈ ఫేక్ వీడియో వ్యవహారం నారాయణ కొంప ముంచబోతుందని మాటలు వినిపిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: