ఉండవల్లి అరుణ్‌ కుమార్.. ఆర్థిక బలం లేక రాజకీయాల నుంచి ఎన్నికల్లో పోటీల నుంచి విరమించుకున్నానాయకుడు. రాష్ట్ర రాజకీయాలపైనా, రాష్ట్ర స్థితిగతులపైనా అవగాహన, నిబద్దత, నిజాయితీ ఉన్న నాయకుడు. ఏ విషయాన్నైనా ఏదో నోటిమాటగా కాకుండా సాక్ష్యాల సహితంగా బయటపెట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. 


అలాంటి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆమధ్య పోలవరం నిర్మాణంపై ప్రెస్ మీట్ పెట్టారు. తనకు కొన్ని అనుమానాలున్నాయని.. తనను పోలవరం పంపిస్తే.. వాటిని అధికారులతో మాట్లాడి క్లియర్ చేసుకుంటానని అడిగారు. కానీ ప్రభుత్వం అందుకు ససేమిరా అన్నది. ఆయన మాటలకు స్పందించలేదు. 

కానీ ఇప్పుడు అదే ప్రభుత్వం సినీ నటుడు శివాజీని మాత్రం పోలవరం గ్రౌండ్ రిపోర్ట్  వివరించడానికి అనుమతి ఇచ్చింది. అక్కడి అధికారులతో సమావేశమయ్యారు. ఇదో అద్భుతం అన్నట్టు వర్ణించారు. ఇదంతా ఓ డాక్యమెంటరీలాగా సాగింది. శివాజీకి అక్కడి అధికారులంతా పూర్తిగా సహకరించారు. 

మరి ప్రభుత్వం ఎందుకు శివాజీ టూర్‌ కు ఎందుకు ప్రాధాన్యం ఇచ్చింది. ఇన్ని మర్యాదలు చేసింది. శివాజీ పాజిటివ్ గా చెప్పారు కాబట్టే..ఆయనకు అలాంటి ట్రీట్ మెంట్ లభించింది.. అదే ఉండవల్లి వెళ్తే.. ఆయన ఏమాత్రం మొహమాటం లేకుండా నిజాలు చెబుతారు కాబట్టే .. ఆయన మాటలకు స్పందించలేదు. అదీ అసలు సంగతి. 



మరింత సమాచారం తెలుసుకోండి: