భారతీయ జనతా పార్టీకి సీన్ అర్థమైపోయింది. మళ్లీ సింగిల్ గా అధికారంలోకి రావడం కష్టమన్న విషయంపై క్లారిటీ వచ్చేసింది. అందుకే ఇప్పుడు మోడీ నోట కొత్త డైలాగ్ వినిపిస్తోంది. ఇప్పుడు ఎవరితోనైనా కలిసి పని చేయడానికి సిద్ధం అంటూ ఆయన ఓ ఇంటర్వ్యూులో చెప్పడం పరిస్థితికి అద్దం పడుతోంది. 


తమను ఎంత తీవ్రంగా వ్యతిరేకించిన వారు అయినా సరే.. కలుపుకుని పోవడానికి సిద్ధమని మోదీ ప్రకటించారు. దీంతో.. మానసికంగా.. తాము వెనుకబడిపోతున్నామని.. మిత్రులను కలుపుకుని పోవడానికి.. సిద్ధమన్న సంకేతాలను.. మోడీ నేరుగా పంపుతున్నారు. ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో.. ఎవరినైనా కలుపుకుంటామని ప్రకటించారు. 

గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ హిందీ హార్ట్ ల్యాండ్‌లో దాదాపుగా 90 శాతానికిపైగా సీట్లు గెలుచుకుంది. ఈ సారి ఆ సీట్లు గెలుచుకునే పరిస్థితి లేదు. కేరళలో శబరిమల ఇష్యూతో బలపడే ప్రయత్నం చేసింది. కానీ ఫలితం వచ్చే అవకాశం లేదు. తమిళనాడులో అన్నాడీఎంకే పొత్తు పెట్టుకున్నా.. సీట్లు వచ్చే పరిస్థితి లేదు. అలాగే.. ఏపీ, తెలంగాణలోనూ అదే పరిస్థితి. ఇక అంతో ఇంతో బలంగా ఉన్న కర్ణాటకలో.. కాంగ్రెస్, జేడీఎస్ పొత్తు పెట్టుకోవడంతో పరిస్థితి మారిపోయింది.

గత ఎన్నికల్లో గుజరాత్ మోడల్ అభివృద్ధి గురించే చెప్పారు. ఇప్పుడు ఎమోషన్స్, భావోద్వేగాలు మాత్రమే వచ్చాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్‌ లాంటి రాష్ట్రాల్లో వ్యవసాయదారులు సంక్షోభం బీజేపీ ఓటు బ్యాంక్‌కు గండికొట్టింది. ఈ కారణంగా కిసాన్ సమ్మాన్ పథకం తీసుకొచ్చారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇతర పక్షాలు కలసి వస్తే.. కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో తప్పులేదు. ఒకప్పుడు బీజేపీ అంటరాని పార్టీగా ఉండేది. ఇప్పుడు.. ఏ పార్టీ అయినా బీజేపీతో కలుస్తోంది. బీజేపీ కూడా ఏ పార్టీని అయినా ఆహ్వానిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: