పోలింగ్‌కు వెళ్లినవారు తమ అసెంబ్లీ, ఎంపీ స్థానంలో పోటీకి ఉన్న వారిలో ఎవరో ఒకరిని తమ ప్రతినిధిగా ఎంచుకుని ఓటు వేస్తారు.. మరి పోటీలో ఉన్నవారు ఎవరూ నచ్చకపోతే.. ఏంచేయాలి.. గతంలో ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఓటింగ్ కు దూరంగా ఉండేవారు. 


కానీ ఓటింగ్ కు దూరంగా ఉండటం అనేది.. నాకు ఎవరూ ఇష్టం లేక దూరంగా ఉన్నా అనే సందేశాన్ని తీసుకెళ్లదు. వివిధ కారణాలతో జనం ఓటింగ్‌కు దూరంగా ఉంటారు. అందుకే 2013 నుంచి ఈసీ ఈవీఎంలో నోటా గుర్తును ప్రవేశ పెట్టింది. అంటే నాన్‌ ఆఫ్‌ ది ఎబౌ అన్నమాట. పైన ఉన్న వారెవరికీ నేను ఓటేయదల్చుకోలేదు అని చెప్పడం.

ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న లెక్కలు పరిశీలిస్తే నోటాకు దాదాపు 2 శాతం ఓట్లు పడుతున్నాయి. ఇది తక్కువ సంఖ్యమే కాదు. చాలా చోట్ల అభ్యర్థి గెలిచిన మెజారిటీ ఓట్ల కంటే నోటాకు వచ్చిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కూడా. మరి ఒక వేళ అందరి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఏంజరుగుతుంది..? 

ఇప్పటి వరకూ ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాలేదు. కానీ.. ఒకవేళ నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చినా దాన్ని పరిగణనలోకి తీసుకోరు. నోటాను తప్పించి పోటీలో ఉన్నవారిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారినే విజేతగా పరిగణిస్తారు. ఎందుకంటే నోటా ఓ అభ్యర్థి కాదు. అది మన భావాన్ని ప్రకటించేందుకు ఉన్న ఏర్పాటు మాత్రమే..



మరింత సమాచారం తెలుసుకోండి: