మంగళగిరిలో తెలుగుదేశంపార్టీ భారీ కుట్రకు తెరలేపిందా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. పోలింగ్ మొదలై సుమారు 2 గంటలు దాటినా చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ఇంత వరకూ మొదలే కాలేదు. ఎందుకంటే, ఈవిఎంలు పనిచేయటం లేదట. ఈవిఎంలు పనిచేయకపపోవటం, కొన్ని చోట్ల మొరాయించటం మామూలే. కానీ మెజారిటీ పోలింగ్  కేంద్రాల్లో ఈవిఎంలు ఇంత వరకూ పనిచేయటం లేదని చెబుతున్నారంటే ఏమనర్ధం ?

 

మంగళగిరిలో టిడిపి తరపున నారా లోకేష్, వైసిపి తరపున సిట్టింగ్ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి పోటీలో ఉన్నారు. వీరిద్దరు గెలుపు కోసం హోరా హోరీగా పోరాటం చేశారు. నిజానికి గెలుపు విషయంలో ఆళ్ళ ముందు లోకేష్ ఎందులోను నిలవలేరు. కానీ అధికారంలో ఉండటం, డబ్బుకు లోటు లేకపోవటంతో లోకేష్ గెలుపుకు పట్టుదలగా ఉన్నారు.  ఎంత జాకీలేసి లేపాలన్నా లోకేష్ వల్ల సాధ్యం కావటం లేదని సమాచారం.

 

ఈ నేపధ్యంలో  ఉదయం నుండి మొదలవ్వాల్సిన పోలింగ్ చాలా కేంద్రాల్లో మొదలేకాలేదు. ఏమంటే ఈవిఎంలు పనిచేయటం లేదని అధికారులు సమాధానం చెప్పటం అనుమానాలకు తావిస్తోంది. ఒక ఈవిఎంలో ప్రాబ్లం వస్తే దానికి ప్రత్యామ్నాయంగా మరోటి పెట్టాలి. కానీ ఓటింగే మొదలుకాలేదంటేనే అందరిలోను అనుమానాలు మొదలయ్యాయి.

 

ఉదయం నుండే ఓటర్లు బారులు తీరి నిలబడ్డారు. ఓటర్ల వరసను చూస్తే తమకు ఎక్కడ వ్యతిరేకంగా వేస్తారో అన్న అనుమానం వచ్చినట్లుంది టిడిపికి.  అందుకే ఈవిఎంలు పనేయటం లేదని చెప్పిస్తున్నారనే అనుమానాన్ని ఆళ్ళ వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 7 గంటలకల్లా పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లు విసుగుపెట్టి చివరకు ఓట్లు వేయకుండానే వెనక్కు వెళ్ళిపోయేట్లు చేస్తున్నారని ఆర్కె ఆరోపిస్తున్నారు.

 

అధికారుల చర్యలకు నిరసనగా ఆర్కె ఓ పోలింగ్ కేంద్రం ముందే భైఠాయించారు. ఓటర్లతో పాటు అభ్యర్ధి కూడా ధర్నాకు దిగటంతో పోలింగ్ కేంద్రం దగ్గరకు వైసిపి శ్రేణులు చేరుకుంటున్నాయి. ఓటమి భయంతోనే ఈవిఎంలను సాకుగా చూపించి ఓటింగ్ జరగకుండా టిడిపి కుట్ర పన్నుతున్నట్లు ఆర్కె మండిపోతున్నారు. ఇలాంటి చీప్ ట్రిక్స్ ఏవో చేస్తే కానీ పాపం లోకేష్ గెలవలేరేమో ?

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: