ఏపీలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ జరుగుతోంది. అయితే, ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు? ఎవరికి సీఎం పీఠం దక్కనుంది? అనే ప్రశ్నలు మరోసారి విస్తృతంగా తెరమీదికి వచ్చాయి. ప్రతి ఒక్కరిలోనూ ఇదే తరహా ఆలోచన హల్‌చల్‌ చేస్తోంది. ఇక్కడ రెండు విషయాలు ప్రధానంగా ప్రస్థావనకు వస్తున్నాయి. ఒకటి అనుభవం పేరుతో అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వానికి పట్టం కట్టాలా?  లేక ఇచ్చిన మాట కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, చేయని నేరాలకు సైతం శిక్ష అనుభవిస్తున్న యువ నేతకు సై! అనాలా? అనే చర్చ సాగుతోంది.

Image result for pavan-jagan-babu

గతానికి భిన్నంగా జరుగుతున్న ప్రస్తుత ఎన్నికల విషయంలో ముక్కోణపు పోటీ ఉంటుందని భావించినా.. ఎన్నికల తేదీలు దగ్గర పడుతున్న సమయానికి ఎన్నికల తంత్రంలో పార్టీల పరిస్తితిపై అంచనాకు రావడం చాలా తేలికగా జరిగిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న ఏకపక్షమని కొందరు అంటే.. ద్విపక్షమని మరికొందరు అంటున్నారు. ఎలా చూసుకున్నా ఏపీలో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసకి నెలకొంది. ప్రస్తుత విపక్షం వైసీపీకే ఎడ్జ్‌ ఉందనే సంకేతాలు బాహాటంగా వినిపిస్తున్నాయి. పరిస్థితి జగన్‌కే అనుకూలంగా ఉందని అంటున్నారు. ప్ర‌స్తుతం పోలింగ్ ట్రెండ్స్ కూడా అవే చెపుతున్నాయి.


రాష్ట్రంలో ఒక నిశ్శబ్ద విప్లవం ప్రారంభమైందని, ప్రతి ఒక్కరూ మార్పును కోరుకుంటున్నారనే సంకేతాలు గడిచిన నెలరోజులుగా వినిపిస్తూనే ఉంది. ప్రతి ఒక్కరూ మార్పు దిశగానే అడుగులు వేస్తున్నారు. ఐదు సంవత్సరాలు చంద్రబాబుకు ఇచ్చాం. ఆయన పాలన చూశాం. మరి నేను కూడా సీఎంను అవుతాను! అని చెబుతున్న జగన్‌కు ఒక్క అవకాశం ఇస్తే పోయేది ఏముంటుంది? అనేవ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. బహుశ ప్రజల నాడిని గ్రహించారోఏమో సీఎం చంద్రబాబు.. మహిళలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేశారు. పసుపు-కుంకుమ వంటి పథకాన్ని రాత్రికి రాత్రి తెరమీదికి తెచ్చారు. 

Image result for ap state

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు ఒక్కరోజు ముందు వరకు కూడా మహిళలకు టీడీపీ ప్రభుత్వం పంచిన నోట్లు అందుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ఓటింగ్‌ సరళి మారుతుందని తొలుత అంచనాలు వచ్చినా.. తర్వాత మాత్రం సైలెంట్‌ ఓటింగ్‌ ప్రారంభం కావడం, ప్రస్తుతం మార్పు కోరుకుంటున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఈ మార్పు వైసీపీకి అనుకూలంగా కూడా ఉంటుందని చెబుతున్నారు. మొత్తానికి జగన్‌ ఆశలు నెరవేరనున్నాయని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: