వైసీపీ అధినేత జగన్‌ ఆశలు ఏమవుతాయి? ఐదేళ్ల కిందట జరిగిన ఎన్నికల్లోనే తాను కేవలం 1% ఓట్లతేడాతో ఓటమిపాలైన విషయాన్ని పదే పదే చెప్పిన జగన్‌.. ఇప్పుడు మాత్రం ఆ సమస్య తనకు ఎదురు కాకుండా చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అనేక రూపాల్లో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. సుదీర్ఘ పాదయాత్ర జగన్‌ను, ఆయన పార్టీని కూడా భారీగా బలోపేతం చేసింది. ప్రతి ఒక్కరికీ పార్టీని చేరువ చేసింది. ఇక, నవరత్నాలు, ఫీజురీయింబర్స్‌మెంట్‌ వంటి కీలకమైన పథకాలు కూడా వైసీపీకి అండగా నిలిచాయి. ప్రతి ఒక్కరిలోనూ ఆలోచనను రేకెత్తించాయి. 


తాము కోరుకుంటున్న నాయకుడు ఈయనే అని ప్రతి ఒక్కరూ అనుకునే వాతావరణం కూడా వచ్చింది. రాష్ట్రం లో పోలింగ్‌ ప్రారంభమైన క్షణం నుంచి కూడా యువత భారీ ఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తుతున్నా రు. అదేవిధంగా పురుషులు కూడా భారీ ఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు వస్తున్నారు. ఈ పరిణామాన్ని దగ్గరగా పరిశీ లిస్తే.. మార్పు దిశగా ఏదో జరుగుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రధానం వైసీపీ అధినేత జగన్‌ ప్రకటిం చిన నవరత్నాలు స్కీంపై పెద్ద ఎత్తున అటు యువతలోను, ఇటు విద్యార్థుల్లోనూ స్పందన బాగుంది. పాదయాత్ర ద్వారా జగన్‌ తమ సమస్యలు విన్నారని, వాటిని పరిష్కరిస్తారనే నమ్మకం తమకు ఉందని అందరూ భరోసా వ్యక్తం చేస్తున్నారు. 


నిరుద్యోగులు కూడా ఇప్పుడు జగన్‌ వెంటనే నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరిలోనూ వైసీపీ ప్రక టించిన నవరత్నాలపై తీవ్రమైన చర్చ సాగుతోంది. తమ జీవితాల్లో మార్పు కావాలంటే.. ఖచ్చితంగా తాము మారాలనే భావన ప్రజల్లో వ్యక్తం కావడం గమనార్హం. ఈ పరిణామమే ఇప్పుడు వైసీపీకి పాజిటివ్‌గా మారు తోందని అంటున్నారు. అదేసమయంలో ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న, చేసిన అక్రమాలపై తాము అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తామంటూ జగన్‌ చేసిన ప్రకటనపై కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. అదేవిధంగా అమరావతి నిర్మాణం, భూ సమీకరణ వంటి విషయాలపైనా జగన్‌ చేసిన ప్రకటనలు ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళాయి. 


జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామన్న జగన్‌ ప్రకటనను తెరచాటున ఆహ్వానించినవారు ఇప్పుడు పోలింగ్‌ కేంద్రంలో తమ ప్రతాపం చూపించేందుకు రెడీ అయ్యారు. ప్ర‌స్తుతం పోలింగ్ జ‌రుగుతోన్న తీరు చూస్తుంటే ఎవ‌రిని క‌దిపినా ఒక్క‌టే మాట వినిపిస్తోంది. ఫ్యాన్ గిరాగిరా తిరుగుతోంద‌న్న మాటే మెజార్టీ ప్ర‌జ‌ల నోట వినిపిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వ‌ర్గాలంద‌రూ ఈ సారి మార్పు కోరుకుంటోన్న విష‌యం పోలింగ్ జ‌రుగుతోన్న తీరు చూస్తుంటూనే తెలుస్తోంది. మొత్తంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున మార్పు దిశగా ప్రజలు అడుగులు వేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: