ఎన్నికలు, పోలింగ్ ప్రజాస్వౌమ్య పండుగ రోజు లాంటిది..సామాన్యునికి ఎన్నో సంవత్సరాలకోమారు వచ్చే అవకాశ ఇది.  ఆంధ్రప్రదేశ్ లోని 175 అసెంబ్లీ ఎమ్మెల్యే సీట్లకు, 25 లోక్ సభ  ఎంపీ స్థానాలకు, ఇక తెలంగాణలో 17 లోక్ సభ ఎంపీ స్థానాలకి పోలింగ్ జరిగిన విషయం విధితమే.


పోలింగ్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో నేమో తెల-తెలవారకుండానే జనాలు క్యూ లైన్లో నుంచొని తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోటీ పడుతున్నారు.  పోలింగ్ మొదలయి రెండు-మూడు గంటలు దాట కుండానే చాలా చోట్ల పోలింగ్ శాతం రెండకెలను దాటుతుండదంటేనే పోలింగ్ ఎంత ధారాళంగా జరుగుతుందో అర్దం చేసుకోవొచ్చు.


కానీ, తెలంగాణలో మాత్రం పోలింగ్ చాలా మందకొడిగా కొనసాగింది, పొలింగ్ సరళి, మొన్నటి వరకు సాగిన ప్రచారంలో కూడా అలానే మందకొడితనాన్ని సూచిస్తుంది. ఈ మద్యనే అసెంబ్లీ ఎన్నికల జరగడం, పార్టీలన్నీ వారి శాయశక్తులా ఎన్నికలను ఎదుర్కొనడం టీఆర్ఎస్ అద్భత మెజార్టీ తో గెలవడం తెలిసిందే. 


నెల వ్యవధిలో జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్లు కొంత ఉదాసీనంగా ఉంటున్నట్లు కనబడుతుంది.  చూడలి సాయంత్రం వరకు ఏమవుతుందో. ఇప్పటికయితే ఎన్నికల పోలింగ్ పండుగ ఆంధ్రలో కళ కళ...తెలంగాణ లో మాత్రం వెల వెల.


మరింత సమాచారం తెలుసుకోండి: