ఏపీలో ప్రశాంతంగా జరుగుతాయని అనుకున్న ఎన్నికలు.. టీడీపీ నేతల రౌడీ రాజకీయాలతో భ్రష్ఠు పట్టిపోయాయి. ఎక్కడికక్కడ దౌర్జన్యాలు, అల్లర్లతో టీడీపీ శ్రేణులు ఎన్నికలను అపహాస్యం చేస్తున్నాయి. ముఖ్యంగా వివాదాలు జరుగుతాయని భావించిన ప్రాంతాల్లో వివాదాలు చోటు చేసుకున్నాయి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, గుంటూరు, ఏలూరు, అనంతపురం, నంద్యాల వంటి ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. ముఖ్యంగా వైసీపీ టార్గెట్‌గా టీడీపీ నేతలు చేస్తున్న హల్‌చల్‌తో ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారైందని అంటున్నారు. సాధారణంగా ఎన్నికలకు ముందుగానే ఎన్నికల సంఘం కొన్ని ప్రకటనలు చేసింది.


వివాదాస్పద ప్రాంతాలను, పోలింగ్‌ కేంద్రాలను కూడా గుర్తించింది. అయితే, ఆయా ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలను పెంపొందించడంలో మాత్రం ఎన్నికల సంఘం విఫలమైంది. దీనిని తమకు అడ్వాంటేజ్‌గా మార్చుకున్న టీడీపీ ఎక్కడికక్కడ అల్లర్లకు పాల్పడుతూ.. దీనిని వైసీపీ నెత్తిన రుద్దేందుకు కూడా టీడీపీ నేతలు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. సాక్షాత్తూ సీఎం చంద్రబాబే తన విజ్ఞతను, సీనియార్టీని పక్కన పెట్టి విద్వేషాలు సృష్టించేలా వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన తరుణంలో ఈ ఎన్నికల విషయంలో ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాల్సి ఉన్నప్పటికీ.. టీడీపీ వైఖరి మాత్రం పొగపెట్టేలా కనిపిస్తోంది. 


ఇక, అదేసమయంలో తమ పార్టీకి ఓటేస్తే.. వైసీపీకి పడుతోందని అప్పుడే చంద్రబాబు ఓ చిత్రమైన వాదనను తెరమీదికి తెచ్చారు. పోలింగ్‌ ప్రారంభమైన రెండు గంటలు కూడా గడవక మునుపే చంద్రబాబు వ్యూహాత్మ కంగా ఇలాంటి వివాదానికి తెరదీయడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ శ్రేణులు రెచ్చిపోతున్నాయి. ప్రధానంగా టీడీపీ మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలైన ఆళ్లగడ్డ, మైలవరంలలో టీడీపీ శ్రేణులు అప్పుడే అలజడి సృష్టించాయి. ఆళ్లగడ్డలో వైసీపీ నేతలపైకే ఏకంగా రాళ్ళదాడి చేశారు. ఈ పరిణామంతో రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఎన్నికల కేంద్రానికి కూడా వెళ్ళలేని పరిస్తితి నెలకొందని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్న వారు కనిపిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: