ప్రజా స్వౌమ్యంలో ఎన్నికలు కీలక ఘట్టమయితే.. పోలింగ్ పండుగ రోజు లాంటిది.  ఏ పార్టీకయినా ఏ నాయకుడికయినా ఇంత కంటే ముఖ్యమయిన రోజు మరొకటి ఉండదేమో.


ప్రభుత్వాలు అన్ని పార్టీలూ - నాయకులు.. పోలింగ్ రోజు నాడు ఓట్లరకు భరోసానిస్తూ ధైర్యం కల్పిస్తూ.. ఉత్సాహం కల్పిస్తూ.. తమ ఓటు హక్కును నిర్భంగా వినియోగించుకునే పరిస్థితిని కలగజేస్తారు. ఎన్నికల నియమావళిను అనుసరించి కలగ చేయాలి కూడా.


ప్రచారం ముగిసిన రోజు నుండి తెదేపా నాయకులు తీరు వివాదాస్పదమవుతుంది.  వైరీ పార్టీ కుట్రలంటూ ఆడియో లీకు లివ్వడం, వాటి గురించి లైవ్ డిబెట్ లో ఒక లెక్కయితే సాక్షాత్తు ముఖ్యమంత్రే చూస్తాం, తేలుస్తాం, వదిలిపెట్టం అంటూ ఎన్నికల కమిషన్ గురించి మాట్లాడటం ఇంకో ఎత్తు.   కొసమెరుపు ఒక రాష్ట్ర ప్రభుత్వాధినేత అయిన ముఖ్యమంత్రి ఎన్నికల కమిషన్ కు వ్యతిరేకంగా ధర్నా చేయడం.


ఇక ఎన్నికల సరళిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు  తెదేపా నాయకులు, అధినేత చంద్రబాబయితే ఏకంగా ఎన్నికల కమిషన్ కు లేఖ రాసేశారు.  పోలింగ్ సరిగ్గా జరగడం లేదని, ఈవీఎంలు పనిచేయడం లేదని, 30 శాతం చోట్లలో పోలింగ్ మొదలు కాలేదు, ఈ ఇలాకాలన్నింలో రీ- పోలింగ్ పెట్టాలని వగైరా..వగైరా..


ఇది అంతా చంద్రబాబు గారు, తెదేపా ఓటమికి చెప్పుకోవడానికి తయారు చేసుకుంటున్న కారణాలంటున్నారు  ఆంధ్రప్రజ.  ఉత్సాహంతో  ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లు తమ ఓటు హక్కును కసిగా వినియోగించుకుంటున్నారు.


ఇదిలా ఉంటే నిన్న ఆంధ్రప్రదేశ్ లో ఓటింగ్ శాతం చాలా బాగా జరిగిందని..కొన్ని చిన్న చెదురుమదురు సంఘటనలు మినహా ఓటింగ్ సరళి చక్కగా సాగిందని ఎన్నికల కమీషనర్ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: