పోలింగ్ శాతం అంటే ఓటర్లు వేసే ఓట్లు, ప్రతి వందమంది ఓటున్న వారిలో ఎంత మంది పోలింగ్ బూత్ కి వచ్చి ఓటేస్తున్నారు అనేది పోలింగ్ శాతం.  


మూములుగా పోలింగ్ శాతం 55% నుండి 65 %... మహా అయితే 68% వరకు మాత్రమే ఉంటుంది.  ప్రత్యేక పరిస్థితులున్నపుడు మాత్రమే, ఓటర్లు కసిగా ఓటింగ్ లో పక్కగా పాల్గొన్నపుడు మాత్రమే ఓటింగ్ శాతం పెరుగుతుంది.  చంద్రబాబు తెలంగాణలో పర్యటన తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఓటర్లు కసిగా పాల్గొని ఓటింగ్ ను పొలోమని 80 శాతానికి పైగా తీసుకెళ్ళారం టారు రాజకీయ విశ్లేషకులు.


పోలింగ్ శాతానికి ప్రభుత్వం పనితీరుకు దగ్గరి సంబంధాలుంటాయంటారు ప్రజా స్వౌమ్యవాదులు, రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం రెండవ సారి ఎన్నికలకు వెళ్లినపుడు పోలింగ్ శాతం అత్యల్పంగా నమోదయ్యింది. రాజశేఖర్ రెడ్డి మరల ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.


పోలింగ్ శాతం పెరిగితే మాత్రం ఓటర్లు, ప్రజలు ప్రభుత్వం పనితీరుపై తమ తీర్పు నిర్ద్వంద్వంగా ఇచ్చినట్లే అనేది ఇప్పటి వరకు ఉన్న డాటా.. అయితే మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికలు దీనికి అతీతం ఇందుకు కారణం మరల రగిలిన తెలంగానం అంటారు రాజకీయ విశ్లేషకులు.


మరి ఆంధప్రదేశ్ లో పోలింగ్ శాతం పెరుగుతుందని సాక్షాత్తు ఎన్నికల అధికారే చెప్పిన వేళ ఆ పెరిగిన పోలింగ్ శాతం ఏ పార్టీకి, ప్రభుత్వానికి ఉపయోగపడుతుందనేది మే 23 వరకు వేచి చూడాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: