పోలింగ్ కేంద్రాల్లో ఈవిఎంలు పనిచేయకపోతే ఎవరికి లాభం ? ఇపుడిదే ప్రశ్న రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. ఎందుకంటే, ఉదయం  7 గంటలకు పోలింగ్ మొదలైనా ఇప్పటి వరకూ చాలా కేంద్రాల్లో ఓటింగ్ మందకొడిగానే జరుగుతోంది. కొన్ని కేంద్రాల్లో అసలు పోలింగే ఇంకా మొదలుకాలేదు. ఉదయం 7 గంటలకల్లా తమ ఓటు వేసేసి వెళ్ళిపోదామని అనుకున్న ఓటర్లు ఇన్ని గంటలపాటు ఎలా వెయిట్ చేస్తారు ?

 

అసలే ఎండలు మండిపోతున్నాయి. ఎర్రటి ఎండల్లో ఓటింగ్ కోసం నిలబడి మాడిపోయే బదులు ఉదయాన్నే ఓటేసి వెళ్ళిపోదామని అనుకున్న ఓటర్లకు తీవ్ర ఆశాభంగం ఎదురైంది. ఈవిఎంలు మొరాయించటంపై చాలా పోలింగ్ కేంద్రాల్లో  అభ్యర్ధులు, పోలింగ్ ఏజెంట్లు ఫిర్యాదు చేసినా పెద్దగా ఉపయగం కనబడలేదు. చంద్రబాబునాయుడు ఫిర్యాదు ప్రకారమే మొత్తం 45, 900 ఈవిఎంల్లో 30 శాతం పని చేయలేదట.

 

ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాత కూడా మాక్ పోలింగ్ నిర్వహించి ట్రయల్ చూసిన తర్వాత కూడా ఈవిఎంలు ఎందుకు మొరాయిస్తున్నాయో అర్ధం కావటం లేదు. ఏపి ఎన్నికల్లో పాల్గొనేందుకు తెలంగాణా నుండి కూడా లక్షల సంఖ్యల్లో చేరుకున్నారు. ఒక అంచనా ప్రకారం వాళ్ళంతా టిడిపికి వ్యతిరేకంగా ఓట్లేసేందుకు వచ్చారట. ఎందుకంటే, మొన్ననే జరిగిన తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళంతా టిడిపికి వ్యతిరేకంగా ఓట్లేసిన విషయం తెలిసిందే.

 

ఏపిలో ఉన్న ఓటర్లకు తోడు తెలంగాణా నుండి వచ్చిన అదనపు ఓటర్లు కూడా వచ్చి టిడిపికి వ్యతిరేకంగా ఓట్లేస్తే తమ పరిస్ధితి గల్లంతే అని టిడిపి నేతలకు అర్ధమైపోయింది. ఇప్పటికే ఎన్నికల కమీషన్ చర్యలతో టిడిపి చాలా ఇబ్బందులు పడుతోంది. అందుకనే చివరి అస్త్రంగా ఈవిఎంలను పనిచేయనీయకుండా టిడిపి నేతలు  చేస్తున్నట్లు వైసిపి ఆరోపిస్తోంది. ఈవిఎంలు పనిచేయకపోతే చాలామంది ఓట్లేయకుండానే వెనక్కు తిరిగెళ్ళిపోయే అవకాశాలున్నాయి.

 

టిడిపికి కావల్సింది కూడా అదే. ఎక్కువ ఓటింగ్ జరిగితే వైసిపికే లాభమని టిడిపి అంచనా వేస్తోంది. అందుకని వీలైనంతలో ఓటింగ్ శాతాన్ని తగ్గించి లాభపడాలని టిడిపి నేతలు ఎత్తులు వేస్తున్నట్లు అనుమానిస్తున్నారు వైసిపి నేతలు. అంటే క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది కూడా ఇపుడదే. అందుకనే వేలాది ఈవిఎంలు పనిచేయకుండా మొరాయిస్తున్నాయి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: